సూపర్ ఐడియా : అమ్మవారి ప్రసాదంగా బర్గర్, సలాడ్

saladసాధార‌ణంగా ఆల‌యాల్లో పూజ ముగిసిన వెంట‌నే పూజారి ప్ర‌సాదం పెడ‌తాడు. అంటే చ‌క్క‌ర‌పొంగ‌ళి, పులిహోరా, ద‌ద్దోజ‌నం, గుగ్గిళ్లు, ల‌డ్డూలాంటివి. కానీ త‌మిళ‌నాడులోని జ‌య‌దుర్గ పీఠం ఆల‌యంలో ఇందుకు భిన్నంగా పాశ్చాత్య దేశ‌పు తిండి అయిన‌ బ‌ర్గ‌ర్లు, సాలడ్లు, కేకులు ఇస్తున్నారు. ఈ ప్ర‌సాదానికి  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI)వారిచే స‌ర్టిఫై కూడా చేయ‌బ‌డింది. ఈ ప్ర‌సాదాల‌పై ఎక్స్‌పైరీ డేట్ కూడా ప్రింట్ చేయ‌డం జ‌రిగింది. ఇక్క‌డ ప్ర‌సాదం కావాలంటే ఆల‌య పూజ‌రి ఇవ్వ‌డు. భ‌క్తుల‌కు ప్ర‌సాదం ఇచ్చేందుకు ఆల‌య ఆవ‌ర‌ణ‌లో ప్ర‌త్యేక‌మైన మెషీన్ల‌ను ఏర్పాటు చేశారు.

భ‌క్తులు పూజ‌లు నిర్వ‌హించిన అనంత‌రం ఆ మెషీన్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఓ టోకెన్‌ను అందులో వేస్తే ఆటోమేటిక్‌గా బ‌ర్గ‌ర్లు, సాలాడ్లు, కేకులు ప్ర‌సాదం రూపంలో చ‌క్క‌గా ప్యాకెట్ల‌లో మెషీన్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఇదిలా ఉంటే పుట్టిన రోజులు జ‌రుపుకునే వారికోసం ఆ ఆల‌యం ఆవ‌ర‌ణ‌లోనే ప్ర‌త్యేక మెషీన్లు ఏర్పాటు చేశారు. అందులో టోకెన్ వేస్తే ఏకంగా బ‌ర్త్‌డే కేకులే ప్ర‌సాదం రూపంలో బ‌య‌టికి వ‌స్తాయి. మెషీన్ల ద్వారా ప్ర‌సాదం అంద‌జేయ‌డం బాగా వ‌ర్క‌వుట్ అవుతోంద‌ని ఆల‌య అధికారులు చెబుతున్నారు. మ‌హిళ‌లు, వృద్ధులు ప్ర‌సాదం కోసం గంట‌ల త‌ర‌బ‌డి వేచిచూడాల్సిన ప‌నిలేద‌ని వారు చెప్పారు.

One Response to సూపర్ ఐడియా : అమ్మవారి ప్రసాదంగా బర్గర్, సలాడ్

  1. raju says:

    waste idea because of we are follow our culture rules & regulation and that prasadam gives good health so that why i said waste

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy