సూపర్ ఐడియా : చిన్న మొక్కతో.. విరుష్కల ఇన్విటేషన్

Virat-Anushka-3విరాట్ కోహ్లి, అనుష్క శర్మ జంట ఎంత క్యూట్‌గా ఉంటుందో.. వాళ్ల వెడ్డింగ్ రిసెప్షన్‌కు సంబంధించిన ఇన్విటేషన్ కార్డు కూడా అంతే క్యూట్‌గా ఉంది. ఈ నెల 11న పెళ్లి చేసుకున్న ఈ క్రికెట్, బాలీవుడ్ ప్రేమ పక్షులు.. ఈ నెల 21న ఢిల్లీలో రిసెప్షన్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం రోమ్‌లో హనీమూన్‌కు వెళ్లిన విరుష్క.. త్వరలోనే ఢిల్లీ రానున్నారు. అయితే ఇప్పటికే రిసెప్షన్‌కు సంబంధించిన ఇన్విటేషన్లు బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులందరికీ వెళ్లాయి. ఇన్విటేషన్ అంటే ఏదో సింపుల్‌గా కాకుండా.. ఓ గిఫ్ట్ బాక్స్‌లాగా గెస్టులకు అందజేస్తున్నారు. లేటెస్టుగా బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ తనకు అందిన ఇన్విటేషన్ కార్డును ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. పెళ్లి రోజు వాళ్లు వేసుకున్న డ్రెస్సుల కలర్‌లోనే ఈ ఇన్విటేషన్‌ను రూపొందించడం విశేషం. దానిపై ఇద్దరు పేర్లు ఉన్నాయి. పక్కనే ఓ చిన్న మొక్కను కూడా ఉంచడం కార్డుకు ఓ స్పెషల్ లుక్ తీసుకొచ్చింది. విరాట్ సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లే ముందే ఈ నెల 21న ఢిల్లీలో, 26న ముంబైలో రెండుసార్లు వివాహ విందును ఇవ్వనున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy