సూపర్ గుడ్ న్యూస్: ఎయిర్ టెల్ ఖుషీ ఖుషీ ఆఫర్

26-1474868249-airtel-best-plans-9-01-1498902474ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ యూజర్లకు సూపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇకపై యూజర్లు ఏ నెలలో అయినా తమకు ఉన్న ఇంటర్నెట్ డేటా లిమిట్‌ను పూర్తిగా వాడుకోకపోతే అందులో మిగిలిన ఇంటర్నెట్ డేటా మరుసటి నెల బిల్లింగ్ సైకిల్‌లో కలుస్తుంది. దీంతో పోస్ట్‌పెయిడ్ యూజర్లు డేటాను పూర్తిగా వాడుకోవడం లేదే.. అన్న దిగులు చెందాల్సిన పనిలేదు. ఒక నెలలో వాడుకోని ఇంటర్నెట్ డేటా మరుసటి నెలకు క్యారీ ఫార్వార్డ్ అవుతుందని ఎయిర్‌టెల్ తెలిపింది. ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ కొత్త ఆఫర్ అందుబాటులోకి వస్తుందని తెలియజేసింది. ఇందులో డేటా కోటాలో మిగిలిపోయిన డేటాను తర్వాతి నెలలో ఉపయోగించుకోవచ్చని తెలిపింది. డేటా రోల్ ఓవర్ ప్రామిస్‌లో భాగంగా ఈ ఆఫర్‌ను యూజర్లకు అందిస్తున్నట్టు ఎయిర్‌టెల్ తెలిపింది.

ఈ రంగంలో ఇదో కొత్త ప్రయోగమని, డేటాను పూర్తిగా ఉపయోగించుకునే అవకాశముందని తెలిపింది. డేటాను వినియోగించుకోలేకపోయామన్న బాధ వినియోగదారులకు ఇక ఉండదని తెలిపింది. మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా ఇలా 200 GBల వరకు ఫార్వార్డ్ చేసుకోవచ్చని వివరించింది. నిజమైన డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ కావడానికి ప్రొజెక్ట్ నెక్ట్స్ సాయపడుతుందని, ఇందుకోసం రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఎయిర్‌టెల్ తెలిపింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy