సూపర్ విక్టరీతో సిరీస్ పై ఆశలు

India South Africa Cricketగెలిచి తీరాల్సిన మ్యాచ్ లో భారత్ సూపర్ విక్టరీ కొట్టింది. విజయ దశమి నాడు.. దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించింది. కోహ్లీ సూపర్ సెంచరీతో ఆకట్టుకోగా.. ఛేజింగ్ లో సఫారీ స్టార్ డివిలియర్స్ స్టన్నింగ్ ఇన్నింగ్స్ వేస్ట్ అయింది. మొత్తంగా నాలుగో వన్డేలో గెలిచి… లెక్కలు సరిచేసింది. ఓడితే సిరీస్ పోతుందనే మ్యాచ్ లో టీమిండియా టీమ్ స్పిరిట్ తో ఆడింది. 300 రన్స్ టార్గెట్ ఛేజింగ్ లో… సఫారీలు… చతికిలపడ్డారు. 35 పరుగుల తేడాతో గెలిచి ఫ్రీడమ్ సిరీస్ ను 2-2తో సమం చేసింది ఇండియా.

Virat Kohli

టాస్ గెలిచి బ్యాటింగ్

ఫస్ట్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా… 50ఓవర్లలో 8వికెట్లకు 299రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 21, శిఖర్ ధావన్ 7 రన్స్ కే ఔటయ్యారు. రహానే సాయంతో కోహ్లీ ఇన్నింగ్స్ నిలబెట్టాడు. రహానే 45రన్స్ చేసి పెవిలియన్ చేరగా… కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. 140 బాల్స్ లో 6 ఫోర్లు,5 సిక్స్ లతో 138 రన్స్ చేసి ఔటయ్యాడు విరాట్. రైనా కూడా హాఫ్ సెంచరీ బాదాడు. 53రన్స్ దగ్గర రైనా ఔటయ్యాడు. స్లాగ్ ఓవర్లలో సఫారీ బౌలర్లు టైట్ గా బౌలింగ్ చేయడంతో… చివరి 5ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 29రన్స్ చేసింది ఇండియా. ధోనీ 15, అక్షర్ పటేల్ 4 రన్స్ చేశారు. ప్రొటీజ్ బౌలర్లలో స్టెయిన్, రబడాలు తలో 3వికెట్లు తీయగా… క్రిస్ మోరిస్ కు ఒక వికెట్ దక్కింది.

 

ఛేజింగ్ లో చతికిలపడిన సఫారీ

300 రన్స్ టార్గెట్ ఛేజింగ్ లో… సౌతాఫ్రికా తడబడింది. 88 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్టేజ్ లో కెప్టెన్ డివిలియర్స్… ఒంటరి పోరాటం చేశాడు. 107 బంతుల్లో 112 రన్స్ చేసిన డివిలియర్స్ ను… భువనేశ్వర్ బౌన్సర్ తో బోల్తా కొట్టించాడు. చివర్లో టెయిలెండర్లు… కొన్ని షాట్లు ఆడగలిగినా… 50ఓవర్లు ముగిసేసరికి… 9వికెట్లకు 264 రన్స్ దగ్గరే ఆగిపోయింది సౌతాఫ్రికా. భారత బౌలర్లలో భువనేశ్వర్ 3, హర్భజన్ 2 వికెట్లు పడగొట్టగా… అక్షర్, అమిత్ మిశ్రా లకు తలో వికెట్ దక్కింది.

India vs South Africa fourth ODI matchవిరాటపర్వం

సూపర్ సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఇక సిరీస్ లో లాస్ట్ వన్డే… 25న ముంబయిలో జరగనుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy