‘సూర్య’గా అల్లు అర్జున్

Allu Arjunరచయిత వక్కంతం వంశీ డైరెక్షన్ లో అల్లు అర్జున్‌ ఓ సినిమాకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్‌’ పూర్తవ్వగానే అల్లు అర్జున్‌ – వక్కంతం వంశీ కలయికలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్టు టాక్. ఈ సినిమాకు ‘నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ అనే పేరుని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. దీంతో పాటు మరికొన్ని పేర్లు పరిశీలిస్తున్నప్పటికీ, ఈ పేరు బన్నీకి బాగా నచ్చిందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈనెల 18న ‘డీజే…’ సందడి: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా హరీష్‌శంకర్‌.ఎస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్‌’ ఫస్ట్‌లుక్‌ని ఈ నెల 18న విడుదల చేయబోతున్నారు. ఫస్ట్‌లుక్‌ని ఈ నెల 18న, టీజర్‌ని మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయబోతున్నాం. ప్రస్తుతం కర్ణాకటలో చిత్రీకరణ జరుగుతోంది’’ అన్నారు దిల్‌రాజు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy