సూర్యాపేట సభకు ఏర్పాట్లు పూర్తి : సీఎం షెడ్యూల్ ఇదే

KCRJసూర్యాపేట జిల్లా తొలివార్షికోత్సవ వేళ పలు అభివృద్ధి పనులు గురువారం(అక్టోబర్-12) సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. పండుగ వాతావరణంలో జరిగే ఈ వేడుకలకు భానుపురి కనీవిని ఎరుగని రీతిలో ముస్తాబైంది. గులాబీ తోరణాలు.. మిరుమిట్లు గొలిపే విద్యుల్లతల వెలుగులతో పట్టణమంతా కొత్తశోభ సంతరించుకుంది. ఇప్పటికే ఇంటింటా మిఠాయిల పంపకం జరిగింది. సుమారు రూ.820కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ సాయంత్రం జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

కలెక్టరేట్, ఎస్పీ భవనాలకు శంకుస్థాపనలు..

ఏడాది క్రితం జిల్లాగా ఆవిర్భవించిన సూర్యాపేట లో నేడు నూతన కలెక్టరేట్, ఎస్పీ భవనాలతోపాటు ఏఆర్ హెడ్‌క్వార్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపనలు చేయబోతున్నారు. సుమారు రూ.60కోట్ల వ్యయంతో ఈ మూడు కార్యాలయాలను నిర్మించబోతున్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి పనితనం… కలెక్టర్ సురేంద్రమోహన్ ఉత్సాహంతో జిల్లా అనేక రంగాల్లో రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుండడంతో మరిన్ని వరాలు చేకూరుతాయని పలువురు ఆశాభావం వ్య క్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన షడ్యూల్ వివరాలు..

– మధ్యాహ్నం 1గంటకు ప్రగతి భవన్ నుంచి బేగంపేటకు వెళ్లి అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో సూర్యాపేటలకు బయల్దేరుతారు.
– మధ్యాహ్నం 2గంటలకు స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌లో దిగుతారు.
– మధ్యాహ్నం 2.10గంటలకు వాహనం ద్వారా గొల్లబజారులోని రెండు పడకల ఇళ్ల ప్రారంభోత్సవానికి వెళ్తారు.
– మధ్యాహ్నం 2.20గంటలకు గొల్లబజార్‌కు చేరుకుంటారు.
– మధ్యాహ్నం 2.40గం.కు చివ్వెంల మండలం కుడకుడ సమీపంలోని నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ స్థలం వద్దకు వెళ్తారు.
– మధ్యాహ్నం 2.50గం.కు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు భూమి పూజ నిర్వహిస్తారు.
– మధ్యాహ్నం 3.20గం.కు అక్కడ నుంచి బయల్దేర్తారు.
– మధ్యాహ్నం 3.30గం.కు చివ్వెంల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తారు.
– మధ్యాహ్నం 3.45గం.కు అక్కడి నుంచి బయల్దేర్తారు.

– మధ్యాహ్నం 3.55గం.కు చివ్వెంల వట్టిఖమ్మంపహాడ్‌కు చేరుకోని 400కేవీ సబ్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు.
– సాయంత్రం 4.10గం.కు వట్టిఖమ్మంపహాడ్ సబ్‌స్టేషన్ నుంచి బయల్దేర్తారు.
– సాయంత్రం4.20గం.కు చివ్వెంల మండలం చందుపట్ల గ్రామానికి చేరుకోని మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభిస్తారు.
– సాయంత్రం 4.40గం.కు అక్కడి నుంచి బయల్దేర్తారు.
– సాయంత్రం4.45గం.కు చివ్వెంల మండలం చందుపట్లలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తారు.
– సాయంత్రం 4.55గం.కు అక్కడ నుంచి బయల్దేరుతారు.
– సాయంత్రం 5.10గం.కు చందుపట్లలోని ఎస్సీ బాలుర వసతి గృహాని పరిశీలిస్తారు.
– సాయంత్రం 5.20గం.కు చందుపట్ల నుంచి బయల్దేరుతారు.
– సాయంత్రం 5.30 సూర్యాపేట పట్టణంకు చేరుకోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు బయల్దేరుతారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy