సృష్టమైన హామీ వచ్చే వరకూ పోరాడతాం : రాజ్ నాథ్ ను కలిసిన TRS ఎంపీలు

trsతెలంగాణ ఎవరికీ సామంత రాష్ట్రం కాదని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే పార్లమెంటులో తమ పోరాటమని తెలిపారు టీఆర్‌ఎస్‌ ఎంపీలు. రాష్ట్ర సమస్యలపై మంగళవారం(మార్చి20) కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిశారు టీఆర్‌ఎస్‌ ఎంపీలు. సమస్యలపై మంత్రిమండలిలో చర్చించి చెప్తామని రాజ్‌నాథ్‌ హామీ ఇచ్చారన్నారు.
పార్లమెంటు రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచీ తాము ఆందోళన చేస్తున్నామని, కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకుా తమ పోరాటం కొనసాగుతుందని, గుణాత్మక మార్పు అజెండాతో టీఆర్ ఎస్ పార్టీ ముందుకు వెళుతుందన్నారు టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి. రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు.12 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదన్నారు ఎంపీ సీతారాంనాయక్‌.
టీడీపీ, వైసీపీల అవిశ్వాసంపై స్పందిస్తూ…. తమతో చర్చించకుండా టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడితే ఎలా మద్దతిస్తామని తెలిపారు. రాజకీయ స్వార్థంలో భాగంగా ప్రజల మద్దతు పొందేందుకు ఏపీకి చెందిన పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసమంటే పిల్లలాట కాదన్నారు. కేసీఆర్‌ను ఎవరో ఆడిస్తున్నారని విమర్శిస్తున్నారని, ఆయనే ఎవరినైనా ఆడించగలరన్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy