సెంచరీ కొట్టిన థియేటర్.. ఇపుడు ప్రపంచంలోనే బ్యూటీఫుల్ బుక్ స్టోర్

అర్జెంటీనా : అర్జెంటీనాలోని అతిపెద్ద కాస్మొపాలిటన్ సిటీ బ్యూనస్ ఎయిర్స్ లోని ఎల్ అటెనియో గ్రాండ్ స్ప్లెండిడ్ థియేటర్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ ఏడాదితో ఈ థియేటర్ కమ్ బుక్ స్టోర్ వందేళ్లు పూర్తిచేసుకుంటోంది. 1919 మే నెలలో ఈ థియేటర్ ను నిర్మించారు. రాజసం ఉట్టిపడే నిర్మాణం… నగిషీలు.. కుడ్యచిత్రాలు… ఇలా… కళ్లు తిప్పుకోనివ్వని నిర్మాణం ఆ థియేటర్ సొంతం. ఏడాదిలోనే దీనిని ఓ మూవీ థియేటర్ గా అప్ గ్రేడ్ చేశారు. కొన్నేళ్లపాటు భారీ థియేటర్ గా ఇది ఫేమస్సయింది. 2000 ఏడాదిలో దీనిని బుక్ స్టోర్ గా మార్చారు. అప్పటినుంచి.. ప్రతిరోజూ ఈ అతిపెద్ద అందమైన బుక్ స్టోర్ కు ప్రపంచం నలుమూలలనుంచి విజిటర్స్ వస్తూనే ఉన్నారు. వందేళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత అందమైన.. అతిపెద్ద బుక్ స్టోర్ గా ఎల్ అటెనియో థియేటర్ రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ అందమైన బుక్ స్టోర్ రాజసాన్ని కింద ఫొటోల్లో మీరూ చూడండి.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy