సెంచురియన్ టెస్ట్ : భారత్ టార్గెట్-287

INDసెంచురియన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో మంగళవారం (జనవరి-16) సౌతాఫ్రికా 258 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌‌ను 28 పరుగుల ఆధిక్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీలను బుమ్రా ప్రారంభంలోనే దెబ్బ తీశాడు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ మార్క్‌రంను పెవిలియన్ పంపిన బుమ్రా ఆ తర్వాత జట్టు కీలక ఆటగాడు అమ్లాని డకౌట్ చేసి భారత్‌కు మంచి ప్రారంభం అందించాడు. ఈ దశలో ఓపెనర్ ఎల్గర్‌తో కలిసి డివిలియర్స్ జట్టును ఆదుకున్నాడు. మూడో వికెట్‌కి 141 పరుగుల భాగస్వామ్యం అందించిన తర్వాత షమీ బౌలింగ్‌లో డివిలియర్స్(80) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వెనువెంటనే షమీ బౌలింగ్‌లో ఎల్గర్(61), డికాక్(12) ఔట్ అయ్యారు. దీంతో జట్టు భారం మొత్తం కెప్టెన్ డుప్లెసిస్‌పై పడింది. ఫిలాందర్‌తో కలిసి నిలకడగా ఆడిన డుప్లెసిస్ ఆఖరివరకూ స్కోర్ పెంచేందుకు పోరాడాడు. ఓవైపు తన తోటి ఆటగాళ్లు పెవిలియన్ చేరుతున్నా తను మాత్రం దృఢంగా క్రీజ్‌లో నిలబడ్డాడు. ఆరో వికెట్‌కి 46 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత ఇశాంత్ బౌలింగ్‌లో ఫిలాందర్ ఔట్ అయ్యాడు. దీంతో సౌతాఫ్రికా మరోసారి కష్టాల్లో పడింది. తర్వాత కొంత సమయానికే డుప్లెసిస్(48) బుమ్రా బౌలింగ్‌లో ఔట్ కావడంతో.. ఆ తర్వాతి ఆటాగాళ్లు ఎవరూ పెద్దగా క్రీజ్‌లో నిలబడకపోవడంతో సౌతాఫ్రికా జట్టు 91.3 ఓవర్లలో 258 పరుగులు చేసి 286 పరుగల ఆధిక్యాన్ని సాధించింది. దీంతో భారత్ రెండో టెస్ట్‌లో విజయం సాధించేందుకు 287 చేయాల్సి ఉంది. భారత బౌలింగ్‌లో షమీ 4, బుమ్రా 3, ఇశాంత్ 2, అశ్విన్ 1 వికెట్ తీశారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy