సెంచూరియన్ టెస్ట్: కసితో ఆడుతున్న కోహ్లీ

kohliదక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో  భారత్‌ మెరుగైన ప్రదర్శన కనపర్చింది. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్ లలో శక్తివంచన లేకుండా పోరాడారు.  కెప్టెన్ విరాట్‌ కోహ్లీ(85 బ్యాటింగ్‌) పట్టుదలతో బ్యాటింగ్ చేస్తున్నాడు. రెండో రోజు ఆట నిలిచే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది టీమిండియా. హార్దిక్‌ పాండ్య (11 బ్యాటింగ్‌) నైట్‌ వాచ్‌మన్‌గా ఉన్నాడు. ఓపెనర్‌ మురళీ విజయ్‌ (46) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. రాహుల్(10), పుజారా(0), రోహిత్ శర్మ(0) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో కష్టాల్లో పడ్డ టీమిండియాను కోహ్లీ గట్టెక్కించాడు. ఇంకో 152 పరుగులు చేస్తే సఫారీ స్కోరు సమం అవుతుంది.

అంతకు ముందు రెండో టెస్టులో సఫారీల ఫస్ట్ ఇన్నింగ్స్ 335 పరుగుల దగ్గర ముగిసింది. ఆదివారం 269/6 ఓవర్‌ నైట్‌ స్కోరు దగ్గర తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌతాఫ్రికా… మరో 66 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయ్యింది. ఆదిలోనే మహరాజ్‌(18) వికెట్‌ను నష్టపోయింది టీమ్. షమీ బౌలింగ్‌లో కీపర్‌ పార్థీవ్‌ పటేల్‌కు  క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఈ వికెట్ తో 100 వికెట్ల క్లబ్ లో చేరాడు షమీ. దీంతో 282 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఏడో వికెట్‌ను కోల్పోయింది.  ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రబడా…  ఆ జట్టు కెప్టెన్‌ డు ప్లెసిస్‌ తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే 324 పరుగుల దగ్గర రబడా ఎనిమిదో వికెట్ గా ఇషాంత్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. మిగిలిన రెండు వికెట్లు ఎంతో సేపు నిలవలేదు. 333 పరుగుల దగ్గర తొమ్మిదో వికెట్ గా డుప్లెసిస్(63)… 335 పరుగుల దగ్గర 10 వికెట్ గా మోర్కెల్(6) వెనుదిరిగారు. భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు తీసుకోగా… ఇషాంత్ 3 వికెట్లు…. షమీ ఒక వికెట్ తీసుకున్నాడు.

సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్: 335 ఆలౌట్

భారత్ తొలి ఇన్నింగ్స్: 183/5

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy