సెంచూరియన్ టెస్ట్: సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్ 335 ఆలౌట్

ashwinరెండో టెస్టులో సఫారీల ఫస్ట్ ఇన్నింగ్స్ 335 పరుగుల దగ్గర ముగిసింది. ఆదివారం 269/6 ఓవర్‌ నైట్‌ స్కోరు దగ్గర తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌతాఫ్రికా… మరో 66 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయ్యింది. ఆదిలోనే మహరాజ్‌(18) వికెట్‌ను నష్టపోయింది టీమ్. షమీ బౌలింగ్‌లో కీపర్‌ పార్థీవ్‌ పటేల్‌కు  క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఈ వికెట్ తో 100 వికెట్ల క్లబ్ లో చేరాడు షమీ. దీంతో 282 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఏడో వికెట్‌ను కోల్పోయింది.  ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రబడా…  ఆ జట్టు కెప్టెన్‌ డు ప్లెసిస్‌ తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే 324 పరుగుల దగ్గర రబడా ఎనిమిదో వికెట్ గా ఇషాంత్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. మిగిలిన రెండు వికెట్లు ఎంతో సేపు నిలవలేదు. 333 పరుగుల దగ్గర తొమ్మిదో వికెట్ గా డుప్లెసిస్(63)… 335 పరుగుల దగ్గర 10 వికెట్ గా మోర్కెల్(6) వెనుదిరిగారు. భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు తీసుకోగా… ఇషాంత్ 3 వికెట్లు…. షమీ ఒక వికెట్ తీసుకున్నాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy