సెంటిమెంట్ ను పక్కన పెట్టిన సినీ ఇండస్ట్రీ

CINIEసెంటిమెంట్ ని చల్ తా అంటోంది టాలీవుడ్ ఇండస్ట్రీ. అవున్నిజమే. సెంటిమెంట్ కి పెద్ద పీటేసి కూర్చోబెడుతుంటారు.. మన టాలీవుడ్ డైరెక్టర్లు.. ప్రొడ్యూసర్లు. హీరోలకి కూడా ఈ సెంటిమెంట్ బానే ఉంటుంది. కానీ ఇప్పుడంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. జస్ట్ కుదిరితే సెంటిమెంట్ లేదంటే.. మూవ్ అవడమే. బిజినెస్సే లెక్కంటున్నారు. సిన్మా రిలీజైందా హిట్టైందా అన్నదే లెక్క  అంటున్నారు. మామూలుగానైతే బోలెడు సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటారు ఇండస్ట్రీ హీరోస్. ఇప్పుడలా కాదు. కాస్త పక్కన పడేస్తున్నారు సెంటిమెంట్స్ ని. కొన్నిటిని ఫాలో అవుతున్నా..మూవీ రిలీజ్ విషయంలో మాత్రం అంతగా కేర్ చేయడం లేదు. మెయిన్ ఫాలో అయ్యేదే రిలీజ్ డేట్ ని. కానీ.. దాన్నే పక్కన బెట్టేసి డేరింగ్ గా ముందుకెళ్తున్నారు డైరెక్టర్లు. వాళ్లని సపోర్ట్ చేస్తూ.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు ప్రొడ్యూసర్లు. ఈ మధ్య అలా రిలీజ్ అయిన సిన్మాలు బానే ఉన్నాయ్.

థియేటర్లు దొరకడమంటే టాలీవుడ్ లో మామూలు మాటర్ కాదు. బ్లాక్ అయిపోయినవనీ.. బ్లాక్ మెయిలింగ్ అనీ.. ఇద్దరు ముగ్గురి చేతిలోనే ఉన్నయనీ.. ఎన్ని మాటలో. అవన్నీ స్క్రీన్ పక్కకి నెట్టేస్తే.. చాలా మంది థియేటర్లు ఎప్పుడు దొరికితే అప్పుడు రిలీజ్ చేస్తున్నారు. కొంత మంది మాత్రం డేట్ ని ఫాలో అవుతూ.. శుక్రవారం సెంటిమెంట్ కి టాటా చెప్పేస్తున్నారు. వాటిలో బడా హీరోల సిన్మాలున్నయ్. పక్క రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అయిన సినిమాలూ ఉన్నయ్.

ఆ మధ్య సూపర్ ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన నితిన్ మూవీ.. ఇదే ఫార్మాట్ లో గురువారం రిలీజైంది. కొరియర్ బాయ్ కల్యాణ్ ని అంటూ.. సెప్టెంబర్ 4న థియేటర్ల డోర్ కొట్టాడు నితిన్. సెంటిమెంట్ ని పక్కనబెట్టేసి.. ఓ రోజు ముందే ఎంట్రీ ఇచ్చాడు. సెంటిమెంట్ అడ్డం తిరిగిందో.. సినిమాలో మేటర్ లేకనా అనేది లైట్ తీసుకుంటే.. సిన్మా మాత్రం బిస్కెట్ అయింది. జనం మాత్రం కొరియర్ బాయ్ ని వదిలేసి.. వేరే అడ్రస్ లో వేరే సిన్మాలు చూశారు.

సుబ్రహ్మణ్యాన్ని కూడా ఇంతే అమ్మేశారు టాలీవుడ్ జీనియస్ లు. సెప్టెంబర్ 24 గురువారం నాడు.. టిక్కెట్లు అమ్మడం మొదలు పెట్టారు. దిల్ రాజు, హరీశ్ శంకర్ లు కూడా సెంటిమెంట్ ని లైట్ తీసుకున్నారు. అఫ్ కోర్స్ జనం కూడా సిన్మాని లైట్ తీసుకున్నారు. మరి దీనికి కూడా సెంటిమెంట్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా లేదా అన్నది కన్ ఫ్యూజనే.

అక్టోబర్ నెల్లో కూడా ఓ రెండు సినిమాలు ఇంతే రిలీజైనయ్. అక్టోబర్ 22న గురువారం రోజు థియేటర్లు వెతుక్కుంటూ వచ్చాడు కొలంబస్. ఇప్పటికే రెండు మూడు సినిమాలు తీసి కాస్తో కూస్తో పేరుతెచ్చుకుంటోన్న సుమంత్ అశ్విన్ కూడా సెంటిమెంట్ గింటిమెంట్ జాన్ తా నై అన్నాడు. కానీ.. ఇది కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

అక్టోబర్ 22 గురువారం నాడు రాజు గారి గదికి తాళం తీశారు ప్రొడ్యూసర్లు. వాళ్లలా తాళం తీశారో లేదో.. వీళ్లిలా ఎంట్రీ ఇచ్చారు. టిక్కెట్లు బానే సేల్ అయినయ్. చిన్న సిన్మా అయినా.. డబ్బులతో పాటు పేరు కూడా తెచ్చుకుంది. చానాళ్ల పాటు.. రాజుగది ప్రేకక్షులతో నిండిపోయింది. భయపడుతూ కూడా గదిలోనే కూర్చున్నారు. దీనిపై మాత్రం సెంటిమెంట్ ఎఫెక్ట్ కనిపించలేదు. హారర్ సినిమా కదా.. గురువారం వర్కవుట్ అయ్యి ఉంటదనుకోవచ్చు అలా చూస్తే.

ఇక బడా సినిమాలు కూడా బానే రిలీజ్ అయినయ్. డిసెంబర్ 10న బెంగాల్ టైగర్ థియేటర్లలోకి వచ్చేశాడు. నానా కష్టాల్లో ఉన్న రవితేజ కూడా సెంటిమెంట్ లేదు ఏం లేదు అని డేర్ చేశాడు. కాపోతే.. ఇది సోసోగా ఆడింది. కథ ఎఫెక్ట్.. డైరెక్టర్ ఎఫెక్ట్.. హీరో ఎఫెక్టా.. అన్నీ డిఫెక్టా.. లేదంటే సెంటిమెంటా కరెక్టా అనేది మనం లైట్ తీసుకుంటే.. సినిమా మాత్రం యావరేజ్ టాక్.

ఇక డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా సేమ్ ఫార్మాట్. మనోడు మామూలుగనే చాలా లైట్ తీసుకుంటాడు. అలాగే శుక్రవారం సెంటిమెంట్ ని కూడా అంతే తీసుకున్నాడు. లోఫర్ ని గురువారం రోజు జనం మీదికి వదిలేశాడు. డిసెంబర్ 17 గురువారం నాడు.. మూవీని రిలీజ్ చేసి.. హిట్ కొట్టాడు. ఇక్కడ కూడా కథ కథనం, డైలాగ్స్, డైరెక్షన్ వంటివి వర్కవుట్ కాగా.. శుక్రవారం సెంటిమెంట్ పూరీ సిన్మాని ఏం చేయలేకపోయింది.

ఇక సెంటిమెంట్ సిన్మాపై ఓ క్లారిటీకొస్తే.. కొన్ని సిన్మాలు హిట్టైనయ్. కొన్ని సిన్మాలు బిస్కెట్టైనయ్. బట్ ఇండస్ట్రీలో మాత్రం సెంటిమెంట్ ని లైట్ తీసుకునేవాళ్లు బానే పెరిగారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy