సెకండ్ టెస్ట్: సిరీస్ పైనే భారత్ దృష్టి

testశ్రీలంకతో తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్‌ సిరీస్‌ విజయంపై దృష్టి పెట్టింది. భారత్-శ్రీలంక రెండో టెస్టు గురువారం (ఆగస్టు3)  నుంచి ప్రారంభం కానుంది. కొలంబో వేదికగా ఉదయం 10 గంటలకు  సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో  రెండుజట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది.  మొదటి మ్యాచ్ లో భారత్‌ 304 పరుగుల తేడాతో గెలిచింది. అనారోగ్యం నుంచి కోలుకున్న శ్రీలంక కెప్టెన్‌ దినేశ్‌ చండిమాల్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతుండగా… భారత జట్టులోకి లోకేశ్‌ రాహుల్‌ రావడం ఖాయమైంది.

గాలే టెస్టులో భారత జట్టు టాప్‌–5 బ్యాట్స్‌మెన్‌ అంతా కనీసం అర్ధ సెంచరీ అయినా సాధించారు. వీరిలో ధావన్, పుజారా, కోహ్లి సెంచరీలతో చెలరేగారు. బ్యాటింగ్‌ విషయంలో టీమిండియా ఏ రకంగా కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. అయితే తుది జట్టులో ఒక కీలక మార్పు జరగనుంది. ఓపెనర్‌ ముకుంద్‌ స్థానంలో రాహుల్‌ బరిలోకి దిగుతున్నట్లు కోహ్లి ఇప్పటికే ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఏడు ఇన్నింగ్స్‌లలో ఆరు అర్ధ సెంచరీలు చేసిన అనంతరం ఆటకు దూరమయ్యాడు. ఇప్పుడు అతని రాక జట్టు బలాన్ని మరింత పెంచనుంది. బౌలింగ్‌ విభాగంలో గత మ్యాచ్‌లో భారత జట్టులో అందరూ వికెట్లు తీశారు. హార్దిక్‌ పాండ్యా కూడా తన తొలి మ్యాచ్‌లోనే ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత్‌ మూడో స్పిన్నర్‌ను ఆడించే ఆలోచన ఉంది. కుల్దీప్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంటే పాండ్యా తప్పుకోవాల్సి రావచ్చు.

తొలి టెస్టుతో పోలిస్తే ఇక్కడి పిచ్‌ పొడిగా ఉంది. రెండు రోజుల పాటు మంచి బ్యాటింగ్‌ చేయవచ్చు. మూడో రోజు నుంచి స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. మ్యాచ్‌ జరిగే రోజుల్లో చిరుజల్లులకు అవకాశం ఉంది.

జట్ల వివరాలు… 

భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, రాహుల్, పుజారా, రహానే, అశ్విన్, సాహా, జడేజా, పాండ్యా/కుల్దీప్, ఉమేశ్, షమీ.

శ్రీలంక: చండిమాల్‌ (కెప్టెన్‌), తరంగ, కరుణరత్నే, కుషాల్‌ మెండిస్, మాథ్యూస్, డిక్‌వెలా, ధనంజయ,  పెరీరా, హెరాత్, పుష్పకుమార, ప్రదీప్‌.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy