సెకండ్ టెస్ట్: 159 పరుగుల తేడాతో భారత్ ఓటమి

మైదానం మారింది. …కానీ భారత ఆటగాళ్ల తీరుమారలేదు. ఫస్ట్ టెస్టులో ఇంగ్లాండ్ కు గట్టిపోటీ ఇచ్చిన కోహ్లీ సేన.. సెకండ్ టెస్టులో కనీస పోటీ ఇవ్వకుండానే సరెండర్ అయిపోయింది. ఇన్నింగ్స్ 159 రన్స్ తేడాతో ఘోరంగా ఓడింది.

ఫస్ట్ ఇన్నింగ్స్ లో 107 పరుగులకు ఆలౌటైన భారత్.. సెకండ్ ఇన్సింగ్స్ లో.. 130 రన్స్ కు ప్యాకప్ అయింది. 61 రన్స్ కే 6 వికెట్లు కోల్పోయిన భారత్ ను.. అశ్విన్-హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. అశ్విన్ 33 రన్స్, పాండ్యా 26 రన్స్ చేశారు. ఇద్దరూ ఏడో వికెట్ కు 55 రన్స్ చేశారు. కోహ్లీ-పుజారా చెరో 17 రన్స్ చేశారు. రహానే 13, కేఎల్ రాహుల్ 10 రన్స్ చేశారు. ఐదుగురు బ్యాట్స్ మెన్ సింగిల్ డిజిట్ దాటలేకపోయారు.

సెకండ్ ఇన్సింగ్స్ లోనూ ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ నిప్పులు చెరిగాడు. అండర్సన్ కు తోడు క్రిస్ బ్రాడ్ చెలరేగాడు. ఇద్దరూ చెరో 4 వికెట్లు తీశారు. ఫస్ట్ ఇన్సింగ్స్ లో సెంచరీ చేసి.. ఓవరాల్ గా 4 వికెట్లు తీసిన క్రిస్ వోక్స్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. జిమ్మీ అండర్సన్ రెండు ఇన్సింగ్స్ ల్లోనూ 9 వికెట్లు తీశాడు.

ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో లీడ్ లో ఉంది. థర్డ్ టెస్ట్ ఈ నెల 18న ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా మూడోటెస్టు జరగనుంది. మరోవైపు బ్యాక్ పెయిన్ తో కోహ్లీ ఇబ్బందిపడటం టీమిండియాను ఇబ్బంది పెట్టే అంశం. లార్డ్స్ టెస్టు ఓటమిపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ షాకయ్యాడు. టీంలో దీ బెస్ట్ ప్లేయర్లున్నా.. ఓడిన తీరు బాధించిందన్నాడు కోహ్లీ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy