సెక్షన్ 8పై గరం గరం

1434684500-4962సెక్షన్ -8పై రాష్ట్ర నేతలు ఫైర్ అవుతున్నారు.   సెక్షన్ జోలికి వెళితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఏపీ సీఎం అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రా ప్రజల దృష్టి మరల్చడానికే ఇదంతా చేస్తున్నారంటున్నారు.

 

ఏసీబీ దర్యాప్తును పక్కదారిపట్టించేందుకే: కడియం

ACB దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే సెక్షన్ -8 ను…AP సీఎం చంద్రబాబు తెరపైకి తెచ్చారన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. స్టేట్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి హింస జరగలేదన్నారు. బాబు రాజకీయ భవిష్యత్ ను కాపాడుకోవటం కోసమే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సెక్షన్-8పై ఎలాంటి పోరాటానికైనా సిద్దమన్నారు కడియం.

సెక్షన్ 8 అమలు ఒట్టిదే: తలసాని

సెక్షన్ 8 అమలు వార్తలు  ఒట్టిమాటలని కొట్టిపారేశారు  మంత్రి తలసాని. దొరికిన  దొంగలకే సమస్యలు తప్ప.. హైదరాబాద్ ప్రజలకేం  ఇబ్బందులు లేవన్నారు . నగరంలో  ఏడాదిగా లేని సమస్యలు ఇప్పుడెలా వస్తాయని…ఇదంతా ఏపీ లీడర్స్ ఆడుకున్న నాటకంగా చెప్పారు మంత్రి.

అమలు చేస్తే రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు: శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే

సెక్షన్-8 అమలు చేయాలని చూస్తే.. ఊరుకునేది లేదన్నారు.. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఈ విషయంలో ఏపీ సీఎం గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. బాబు కుట్రలకు కేంద్రం కూడా తలొగ్గుతోందన్న అనుమానాలు వ్యక్తం చేశారు.  సెక్షన్ -8ను అమలు చేస్తే మరోసారి రాష్ట్రంలో ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడుతాయని హెచ్చరించారు గులాబీనేతలు.

ఇంకా ఎలాంటి సమాచారం లేదు: కేకే

సెక్షన్ 8 అమలుపై తమకెలాంటి సమాచారం లేదన్నారు ఎంపీ కేశవరావు. గవర్నర్ కు కూడా ఎలాంటి ఆదేశాలు అందలేదన్నారు. నోటుకు ఓటుకు కేసులో టీఆర్ఎస్ నుంచి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేదన్నారు. చట్ట ప్రకారమే.. ఏసీబీ తన పని తాను చేసుకుపోతుందన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకే కొందరు రాష్ట్రంలో అనవసర గందరగోళాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు కేకే.

సెక్షన్ 8 అవసరమే లేదు: కాంగ్రెస్ నేతలు

సెక్షన్-8 అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు  కాంగ్రెస్ ఎమ్మెల్యే  జీవన్ రెడ్డి. హైదరాబాద్ లో శాంతి భద్రతలు కంట్రోల్ లోనే  ఉన్నాయన్నారు. సెక్షన్ 8 ఉల్లంఘన  ఎక్కడా జరగలేదన్నారు. ఏడాది తరువాత ఏపీ సీఎం చంద్రబాబుకు సెక్షన్-8  గుర్తురావడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ  ఎమ్మెల్యే  గండ్ర వెంకటరణ రెడ్డి. ఓటుకు నోటు  కేసు నుంచి తప్పించుకునేందుకు  బాబు అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

తెలుగు ప్రజల మధ్య గొడవులు పెట్టేందుకు బాబు ప్రయత్నం: ఎమ్మెల్సీ కర్నె

సెక్షన్ 8 అమలు చేయాలనే చంద్రబాబు కుట్రను  తిప్పికొడతామన్నారు టీఆర్ఎస్ నేతలు. తెలుగు ప్రజల మధ్య గొడవలు  పెట్టేందుకు బాబు ప్రయత్నం  చేస్తున్నారని కామెంట్  చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు  సెక్షన్ 8 కు సంబంధంలేదన్న గులాబీ నేతలు…. అవసరమైతే కోర్టుకు వెళ్తామన్నారు ఎమ్మెల్యే బాలరాజు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy