సెప్టిప్ ట్యాంక్ లో 800 పిల్లల శవాలు..!

Irland-children-buried-in-septic-tank2చరిత్రను తవ్వుకుంటూ పోతే ప్రపంచం నివ్వెరపోయే నిజాలు బయపడుతుంటాయి. ఎన్నో అగాయిత్యాలు, అరాచకత్వాలు చరిత్ర లో కలిసిపోయాయి. తాజాగా అలాంటి భయంకరమైన వార్త ఒకటి బయటపడింది. ఒక సెప్టిక్ ట్యాంక్ లో 800 మంది చిన్నారుల శవాలు బయటపడటం కలచివేస్తోంది. ఐర్లాండ్ లోని టౌమ్, కౌంటీ గాల్వేలో వెలుగు చూసిన ఈ నిజం అక్కడి వ్యవస్థను ప్రశ్నిస్తోంది. పెళ్లి కాని మహిళలకు జన్మించిన 796 మంది పసి పిల్లలను సెప్టిక్ ట్యాంకులో పాతిపెట్టారు. 1925 నుంచి 1961 మధ్య కాలంలో అరాచకత్వం చోటు చేసుకుంది. పసిపిల్లలను సెవేజ్ ట్యాంకులో పూడ్చి పెట్టారని దీనిపై రీసర్చ్ చేస్తున్న కేథరిన్ కోర్లెస్ తెలిపారు. ఐర్లాండ్ కేథలిక్ చర్చ్ నిర్వహించిన ‘మదర్ అండ్  బేబీ హోమ్స్’ లలో ఈ దారుణాలు చోటు చేసుకున్నాయి. పెళ్లి కాని, అత్యాచారాలకు గురైన మహిళలు కాన్పులకోసం వెళ్లినపుడు పుట్టిన పిల్లలను బయటి ప్రపంచానికి తెలియకుండా ఆశ్రమాల్లోని సెప్టిక్ ట్యాంకులో పూడ్చారు.

పెళ్లికాని తల్లులు, వారి పిల్లలు ఐర్లాండ్ ప్రతిష్టకు మరకలా భావించేవారట అప్పటి క్యాథలిక్ లు. అంతే కాకుండా డబ్బు, పలుకు బడి ఉన్న పెద్దలు చేసిన అఘాయిత్యాలు బయట పడకుండా ఉండేందుకు ఈ విధంగా పాతిపెట్టారట. ఇందులో మరో నిజమేంటంటే.. బ్రహ్మచారులు, మత గురువులు, సంపన్న వర్గాల పురుషులు చేసిన ఈ దాష్టీకాన్ని బయటకు రానీయకుండా కొన్నిసార్లు పిల్లలతో పాటు తల్లులను కూడా ఖననం చేసే వారని చెబుతున్నారు. ఏ దేశమైతే నేమి, ఏ ప్రాంతమైతే నేమి.. సంపన్నులు, మత గురువులు చేసిన ఇలాంటి ఆగడాలు తవ్వే కొద్ది కోకొల్లలు బయట పడుతాయి. దేశ పరువు అనే దుప్పటి కింద ఇలాంటి దారుణాలను కప్పి పెట్టారు. వీరి ఆగడాల వల్ల ఎంత మంది చిన్నారుల భవిష్యత్తు కాలగర్భంలో కలిసి పోయిందో.. ఎంత మంది మహిళల స్వేశ్చ నాలుగు గోడల గదికే పరిమితమైందో..? ఇలాంటి ఘటనలు బయటపడ్డ నాడు కాస్త ఆశ్చర్యానికి, ఆవేదనకు గురై తర్వాత మర్చి పోవడమే తప్ప ఎవరూ  చేసేదేమీ లేదు..!

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy