సెప్టెంబర్ 1 నుంచి JEE మెయిన్ దరఖాస్తులు

దేశవ్యాప్తంగా IIT,NITలలో ప్రవేశాల కోసం రెండుదశల్లో నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (JEE) మెయిన్ పరీక్షలకు నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) తమ వెబ్‌సైట్‌ను ( nta.ac.in)  అందుబాటులోకి తెచ్చింది. JEE మెయిన్ దరఖాస్తులను  సెప్టెంబర్1వ తేదీ నుంచి స్వీకరించనుంది.

విద్యార్థులు తమ వెబ్‌సైట్‌ ద్వారానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఇప్పటివరకు ఈ పరీక్షను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) నిర్వహించగా… ఇప్పటి నుంచి NTA ఆధ్వర్యంలో పరీక్షలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. JEE మెయిన్‌ను ఏటా రెండు సార్లు నిర్వహించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. ప్రస్తుతం జనవరిలో నిర్వహించే JEE కోసం దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది.

సెప్టెంబర్‌ 1 నుంచి 30వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనుంది. ఇప్పటివరకు JEE మెయిన్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్నప్పటికీ ఇకపై ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా NTA చర్యలు చేపట్టింది. మెయిన్ తొలిదశ పరీక్షలను 2019 జనవరి 6 నుంచి 20 వరకు, రెండోదశ పరీక్షలను ఏప్రిల్ 7 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy