సెప్టెంబర్ 11న ఎంసెట్-3

53135522ఎంసెట్-3 షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. జెఎన్ టీయుూ రిజిస్ట్రార్ ఎన్. యాదయ్య ఎంసెట్-3  కన్వీనర్ గా నియమితులయ్యారు. సెట్ కమిటీ మీటింగ్ తర్వాత సవివరమైన షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఎంసెట్-2 పేపర్ లీక్ అయినట్లు ఖరారు కావటంతో ఆ పరీక్ష రద్దయ్యింది. తల్లిదండ్రులు, విద్యార్ధులు సహృదయంతో అర్ధం చేసుకోవాలని  సీఎం కేసీఆర్ స్వయంగా విజ్ఞప్తి చేశారు. లీకేజీ విషయాన్ని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి కూడా తీసుకొని వెళ్లింది. చివరికి మళ్లీ పరీక్ష నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy