సెప్టెంబర్-15నుంచి స్వచ్ఛతా హీ సేవ ఆందోళన్ : మోడీ

సెప్టెంబర్-15నుంచి ఆగస్టు-2వరకూ స్వచ్ఛతా హీ సేవ ఆందోళన్ ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సెప్టెంబర్-15న ఉదయం 9 గంటల 30నిమిషాల సమయంలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనబోతున్నారని మోడీ తెలిపారు. చిన్నపిల్లలు, యువత, పెద్దవాళ్లు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అవ్వాలని తాను ఆహ్వానిస్తున్నానని మోడీ తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీకి స్వచ్ఛత ద్వారా ఘన నివాళి అర్పిద్దామని పిలుపునిచ్చారు మోడీ. అక్టోబర్ 2 మహాత్మాగాంధీ 150వ జయంతి. అదే రోజుకి స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం ప్రారంభించి కూడా 4 ఏళ్లు పూర్తవుతోంది. స్వచ్ఛ్ భారత్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రజా ఉద్యమంగా మలచినవారందరికీ మోడీ థ్యాంక్స్ చెప్పారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy