సెప్టెంబర్ 24న అమీర్ పేట్ – ఎల్బీ నగర్ మెట్రో ప్రారంభం

హైదరాబాద్ : హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది HMR. సెప్టెంబర్ -24న అమీర్ పేట్-LB నగర్ రూట్ ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. దీనిపై చర్చించేందుకు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిశారు మంత్రి కేటీఆర్. మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించాలని కేటీఆర్ గవర్నర్ ను కోరారు. దీనికి తన అంగీకారాన్ని తెలిపారు నరసింహన్.

గవర్నర్ ని కలిసిన వారిలో కేటీఆర్ తో పాటు.. సీఎస్ ఎస్కే జోషీ , మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి  అరవింద్ కుమార్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తయ్యాయని.. సెప్టెంబర్-24న మధ్నాహ్నం 12.15 నిమిషాలకు ఎల్బీనగర్-మియాపూర్ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి టైం ఫిక్స్ చేసినట్లు తెలిపారు.

LB నగర్ నుంచి అమీర్ పేటకు ప్రయాణించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఈ రూట్ లో మెట్రో రావడంతో వాహనదారులకు కాస్త ఊరట లభించనుందని తెలిపింది హైదరాబాద్ మెట్రో రైల్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy