సెమీఫైనల్లోకి శ్రీకాంత్‌

sriiఅద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లోనూ అదరగొడుతున్నాడు. శుక్రవారం( అక్టోబర్-20) జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 14–21, 22–20, 21–7తో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.

ఈ గెలుపుతో ఈ ఏడాది అక్సెల్‌సన్‌ చేతిలో జపాన్‌ ఓపెన్‌లో, ఇండియా ఓపెన్‌లో తనకు ఎదురైన పరాజయాలకు హైదరాబాద్‌ ప్లేయర్‌ శ్రీకాంత్‌ ప్రతీకారం తీర్చుకున్నాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy