సెమీస్ లో అర్జెంటీనాతో తలపడనున్న నెదర్లాండ్స్ ..

argentina-win-belgiumఫిఫా వరల్డ్ కప్ లో ఒక సెమీ ఫైనల్ జర్మనీ vs బ్రెజిల్ కు మధ్య జరగనుండగా.. మరో సెమీఫైనల్ పోరు ఎవరెవరికో తేలిపోయింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ లో బెల్జియం పై గెలిచి 24 ఏళ్ల తర్వాత సెమీస్ కు చేరింది అర్జెంటీనా. సెమీస్ లో నెదర్లాండ్స్ తో తలపడనుంది. శనివారం జరిగిన మ్యాచ్ లో టైటిల్ ఫేవరేట్ అర్జెంటీనా గెలిచింది. బెల్జియంపై 1-0 తేడాతో గెలిచింది. అర్జెంటానా ప్లేయర్ గొంజాలో హిగ్వైన్ ఎనిమిదో నిమిషంలో గోల్ కొట్టడంతో అర్జెంటీనా లీడ్ సాధించింది. ఆ తర్వాత సూపర్ డిఫెన్స్ తో బెల్జియం కు ఛాన్స్ ఇవ్వలేదు అర్జెంటీనా. 1990 వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరిన అర్జెంటీనా 24 ఏళ్ల తర్వాత మళ్లీ సెమీస్ కు చేరింది. 1990 వరల్డ్ కప్ ఫైనల్ లో జర్మనీ చేతిలో ఓడిపోయింది.

nedarland-win-costaricaకోస్టారికా పై కష్టపడి గెలిచిన నెదర్లాండ్స్ :

ఇక ఆదివారం ఉదయం జరిగిన మరో మ్యాచ్ లో నెదర్లాండ్స్ గెలిచింది. కోస్టారికాపై 4-3 తేడాతో గెలిచి సెమీస్ కు చేరింది. మ్యాచ్ నిర్ణీత సమయంలో రెండు టీమ్ లు ఏ ఒక్క గోల్ కొట్టకపోవడంతో.. పెనాల్టీ షూట్ కు దారితీసింది. పెనాల్టీ షూటవుట్ లో సబ్ స్ట్యూట్  గోల్ కీపర్ టిమ్ క్రుల్ రెండు గోల్స్ ను ఆపి నెదర్లాండ్స్ కు గెలుపు అందించాడు. ఈజీగా గెలుస్తుందనుకున్న ఫేవరేట్ నెదర్లాండ్స్ ఈ మ్యాచ్ లో చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో కోస్టారికా సూపర్బ్ గా ఆడి నెదర్లాండ్స్ కు ఒకానొక దశలో వణుకు పుట్టించింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy