సెయింట్ హుడ్ గా మదర్ థెరెసా

therisaఅనాథలకు, పేదలకు అండగా నిలిచి… వారికి ప్రేమను పంచి, వారి సేవకే జీవితాన్ని అంకితం చేసిన మదర్ థెరెసాకు అరుదైన గౌరవం దక్కనుంది. మరణానంతరం ఆమె చూపిన రెండో మహిమను పోప్ ఫ్రాన్సిస్ గుర్తించారు. దీంతో ఆమెను త్వరలోనే సెయింట్ ఆఫ్ రోమన్ కాథలిక్ చర్చ్ గా ప్రకటించనున్నారు. దీనిని వాటికన్ సిటీ అధికారికంగా ధ్రువీకరించిందని మిషనరీస్ ఆఫ్ చారిటీ తెలిపింది. 2016 సెప్టెంబర్ 16న సెయింట్ హుడ్ హోదా ఇవ్వనున్నారు.  థెరెసాకు సెయింట్ హోదాపై సంతోషం వ్యక్తం చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మిషనరీస్ ఆఫ్ చారిటీకి శుభాకాంక్షలు తెలిపిన మమత… థెరెసా ప్రజల కోసం ఎంతగానో కృషి చేశారన్నారు. క్యాథలిక్ న్యూస్ పేపర్ అవెనైర్ రిపోర్ట్ ప్రకారం… మెదడులో కణితితో బాధపడుతున్న బ్రెజిల్ వ్యక్తి ఒకరు మదర్ థెరెసా మహిమతో పూర్తిగా జబ్బు నుంచి కోలుకున్నాడు. అతడి బంధువులు థెరెసాకు ప్రార్థనలు చేయడంతో జబ్బు నయమైందని… వాటికన్ గుర్తించింది. సెయింట్ హోదా రావడానికి కనీసం రెండు అద్భుతాలు జరగడం సంప్రదాయం. 1998లో కడుపులో కణితితో బాధపడుతున్న బెంగాల్ గిరిజన మహిళ… థెరెసా మహిమతో జబ్బు నుంచి బయటపడ్డట్టు… 2002లో వాటికన్ నిర్ధారించింది. 2003లోనే థెరెసాకు అప్పటి పోప్ జాన్ పాల్ బీటిఫికేషన్ కల్పించారు. థెరెసాకు సెయింట్ హోదా రావడంపై… మిషనరీస్ ఆఫ్ ఛారిటీలో… సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. మదర్ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy