సెలవులు వద్దని అకున్ కు నేనే చెప్పా.. ఎవరినీ వదలొద్దు

KCRడ్రగ్స్, కల్తీల నియంత్రణ విషయంలో ఎవరినీ వదలొద్దని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. దూకుడు మరింత పెంచాలన్నారు. తెలంగాణలో తామేం చేయలేమని అక్రమార్కులు భయపడే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం ప్రగతి భవన్ లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  ఇంకా దూకుడు ప్రదర్శించాలి. తుది వరకు శ్రమించాలి. పనిలో మరింత తీవ్రత పెంచండి. లోతుల్లోకి వెళ్లాలి. ఎవరెవరి పాత్ర ఎంతుందో వెలికి తీయాలి. బాధ్యులైన వారందిపైనా చర్యలు తీసుకోవాలి.  రాజకీయ నాయకులైనా, చివరికి కేబినెట్ మంత్రి పాత్ర ఉన్నా కేసు పెట్టాలని ఆదేశించారు. రక్తాన్ని కూడా కల్తీ చేసి అమ్ముతున్నారనే విషయం తెలిసి తన మనసెంతో చలించిందని, ఇలాంటి వారికి జీవితకాల కారాగార శిక్ష పడే విధంగా అవసరమైతే కొత్త చట్టాలు తేవాలని సీఎం అన్నారు. డ్రగ్స్, కల్తీలను అరికట్టే విషయంలో తెలంగాణ పోలీస్, ఎక్సైజ్, ఇతర శాఖల అధికారులు చేస్తున్న కృషి చాలా గొప్పగా ఉందని సీఎం ప్రశంసించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడం అత్యంత అవసరం. హైదరాబాదే తెలంగాణకు లైఫ్ లైన్. కాబట్టి హైదరాబాద్ లో అరాచకం అంతం కావాలి. కేసు పరిశోధనలో ఉన్న సమయంలో సెలవులో వెళ్లవద్దని నేనే అకున్ సభర్వాల్ కు సూచించా. కేసు పూర్వోపరాలన్నీ క్షుణ్ణంగా వెలికి తీయండి. ఎవరినీ వదలద్దు. అందరినీ శిక్షించాలి. హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేయలేము, వినియోగించలేము అని భయభ్రాంతులయ్యేలా మన చర్యలుండాలి. హైదరాబాద్ బాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటిగా మార్చాలి’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy