సెలవుల్లో మార్పులేదు: జూన్ 1నుంచే స్కూల్స్

schoool-siteముందుగా ప్రకటించిన ప్రకారమే రాష్ట్రంలో స్కూళ్లు జూన్ 1 నుంచి ప్రారంభమవుతాయని విద్యాశాఖ తెలిపింది. ఎండల తీవ్రత దృష్ట్యా పెంచాలన్న ప్రతిపాదనను తిరస్కరించిన విద్యాశాఖ…జూన్ మొదటి వారం(జూన్ 4-జూన్ 8) ఒంటి పూట బడులు నడపాలని నిర్ణయించినట్లు తెలిపింది. దీనికి సంబంధించి సర్క్యూలర్ ను జారీ చేసిన ప్రభుత్వం…సెలవులు ఇచ్చారని జరుగుతున్న ప్రచారం ఆవాస్తవమని తెలిపింది. స్కూల్స్ ప్రారంభమైన తర్వాత ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు టీచర్లకు బడిబాట కార్యక్రమం ఉంటుందని స్పష్టంచేసింది.

జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవం ఉన్నందునే విద్యా సంస్థలను ముందే ప్రారంభించాలని గతం లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy