సెల్ఫీ చావులు ఇక్కడే ఎక్కువ

shelfi deathముంబైలోని మెరైన్‌ డ్రైవ్‌కి వెళ్లి, అలల ముంగిటనిలబడి సెల్ఫీకోసం ప్రయత్నించింది 17 ఏళ్ల ప్రీతి. జాగ్రత్తలన్నీ పక్కన పెట్టి మరికొంచెం నీళ్లకు దగ్గరగా వెళ్లి రాకాసి అలలకు బలైపోయింది ఆ బాలిక. ఒక్క ప్రీతి అనేకాదు … సెల్ఫీల పిచ్చిలో పడి ప్రాణాలను కోల్పోతున్నవారి సంఖ్య మనదేశంలోనే అత్యధికంగా ఉందని వెల్లడించింది ఓ సర్వే. ప్రపంచవ్యాప్తంగా మార్చి 2014 నుంచి సెప్టెంబరు 2016 వరకు సెల్ఫీ మరణాలు 127 ఉండగా, అందులో 76 ఇండియాలోనే చోటు చేసుకున్నాయని కెర్నగ్‌ మెలన్‌ వర్సీటీ, ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీన్ని బట్టి చూస్తే సెల్ఫీ చావులు మనదగ్గరే ఎక్కువ జరుగుతున్నట్లు అర్థమవుతుంది.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy