సెల్ఫీ టైం : చిరంజీవి – కవిత ముచ్చట్లు

kavitha

అభిమాన హీరోతో సెల్ఫీ అంటూ నిజామాబాద్ ఎంపీ కవిత పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. ఢిల్లీలో ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు రాజ్యసభ ఎంపీ చిరంజీవి వచ్చారు. అదే టైంలో అక్కడ కవిత కూడా ఉన్నారు. దీంతో కవిత.. చిరుతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మరికొంత సమయం రాజకీయాలు చర్చించుకున్నారు.

ఇటీవల చిరంజీవి సభకు హాజరుకావటం లేదు. అత్యంత తక్కువ హాజరు ఉన్న ఎంపీల్లో మెగాస్టార్ ఒకరు. దీంతో మిగతా ఎంపీలతో ఆయన కలవటం చాలా అరుదు. ఉప రాష్ట్రపతిగా తెలుగు వ్యక్తి వెంకయ్యనాయుడు పోటీలో ఉండటంగా.. అన్ని షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని మరీ చిరంజీవి ఢిల్లీకి వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా దిగిన సెల్ఫీనే ఇది.. ఈ ఫొటోను మెగా ఫ్యాన్స్ తోపాటు కవిత అభిమానులు లైక్స్, షేర్స్ విపరీతంగా కొట్టటంతో వైరల్ అయ్యింది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy