సెహ్వాగ్ సూపర్ ఇన్నింగ్స్ తో ఫైనల్స్ కు పంజాబ్…

kxip_650_053014045458లాస్ట్ స్టేజ్ లోనూ ఐపీఎల్ కిక్కే ఎక్కించింది. పంజాబ్-చెన్నైల మధ్య జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్ ఆద్యంతం అద్భుతంగా సాగింది. మొదట వీరేంద్ర సెహ్వాగ్ వీర విహారంతో పంజాబ్ భారీ స్కోరు చేసింది. తామేం తక్కువ తిన్నామా అంటూ చెన్నై బ్యాట్స్ మెన్ కూడా చితక్కొట్టారు. ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డా… చివరకు పంజాబ్ నే విజయం వరించింది. రైనా భీకర ఇన్నింగ్స్ ఆడినా… కీ టైంలో రనౌట్ కావడం మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఈ మ్యాచ్ లో ఏకంగా 428 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్ ఫస్ట్ సీజన్ లో మినహా… ఎప్పుడు కనీసం సెమీస్ కైనా వెళ్లలేదు పంజాబ్. ఈ సారి మాత్రం ఫస్ట్ నుంచి సూపర్ ఫర్ ఫామెన్స్ తో నాకౌట్ వరకు వచ్చింది. ఫస్ట్ క్వాలిఫయర్ లో కోల్ కతా చేతిలో ఓడిపోయింది. సెకండ్ క్వాలిఫయర్ లో మాత్రం రెచ్చిపోయింది. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ బ్యాటింగ్ కు దిగింది. ఆరంభం నెమ్మదిగానే మొదలైంది. ఆ తర్వాత వీరంగం స్టార్ట్ అయింది. సెహ్వాగ్ 58 బంతుల్లో 122 రన్స్ చేశాడు. మిల్లర్ 38 రన్స్ చేయడంతో 20 ఓవర్లలో పంజాబ్ 226 పరుగులు చేసింది. 227 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై… విజయానికి 24 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఆ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి… 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. రైనా సంచలన ఇన్నింగ్స్ ఆడినా… మెక్ కల్లమ్ వల్ల రనౌట్ అయ్యాడు. 25 బంతుల్లోనే రైనా 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ లో ధోనీ మినహా ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో పంజాబ్ విజయం సాధించింది.
సూపర్ సెంచరీ కొట్టిన వీరేంద్ర సెహ్వాగ్ కు మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు లభించింది. జూన్ 1న జరిగే ఫైనల్లో పంజాబ్ కోల్ కతాతో తలపడనుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy