సేన కదిలి వస్తుంది : టీఆర్ఎస్ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తి

PLENARYTRS 17వ ప్లీనరీ ఏర్పాట్లు అద్భుతంగా సాగుతున్నాయి. శుక్రవారం ఏప్రిల్ 27న జరగనున్న TRS ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లిలోని GBR కల్చరల్ సొసైటీలో భారీ ఏర్పాట్లు చేశారు నేతలు. ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పార్కింగ్, భోజనం, మంచినీటి వసతుల్లో లోటు లేకుండా చూస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున మజ్జిగ, అంబలి, వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్లీనరీ వేదికకు ప్రగతి ప్రాంగణంగా నామకరణం చేశారు.

ప్రాంగణంలో తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, డబుల్ బెడ్ రూం ఇళ్లు, కేసీఆర్ కిట్.. ఇలా రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న పథకాలన్నింటినీ ఈ తోరణాలు చాటి చెబుతున్నాయి. ప్లీనరీని దిగ్విజయం చేసేందుకు కృషి చేస్తోంది TRS.

ప్రతినిధుల సభ కోసం విద్యార్థి విభాగం నుంచి 550 మందిని ఎంపిక చేశారు. రెండు రోజులు శిక్షణ ఇచ్చారు. ప్రతినిధుల నమోదు, మెడికల్‌, పార్కింగ్ దగ్గర వీరిని వాలంటీర్లుగా నియమించనున్నారు. కొంపల్లిలో డెమో కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ ప్లీనరీ విజయవంతం చేసేందుకు క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా పని చేస్తామని చెబుతున్నారు విద్యార్థి నాయకులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy