సైకిల్ తొక్కిన గవర్నర్ నరసింహన్, కేటీఆర్

హైదరాబాద్ : ఎల్బీ నగర్ మెట్రో రైలు ప్రారంభ కార్యక్రమం అంతా ఉత్సాహంగా జరిగింది. గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్, ఇతర నేతలు ఉల్లాసంగా కనిపించారు. అమీర్ పేట్ స్టేషన్ నుంచి.. ఎల్బీనగర్ వెళ్తూ.. మధ్యలో ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లో ఓసారి దిగారు. జంక్షన్ కావడంతో.. అక్కడి మెట్రో స్టేషన్ ఫెసిలిటీస్ ను గవర్నర్ కు కేటీఆర్ వివరించారు.

ఆ తర్యావాత అంతా కలిసి ఎల్బీనగర్ చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో గవర్నర్ నరసింహన్, కేటీఆర్ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ లోనే దిగారు. అక్కడి నుంచి సైకిల్ పై ప్రయాణించారు. సెక్యూరిటీ వారిని అనుసరించారు. రాజ్ భవన్ వరకు నరసింహన్, కేటీఆర్ కలిసి రెండు సైకిళ్లపై వెళ్లారు. కాలుష్యం తగ్గించాలంటే సైకిల్ ప్రయాణం మంచిదని… శరీరం, ఆరోగ్యం ఫిట్ గా ఉంటుందన్న మెసేజ్ ఇచ్చేందుకు గవర్నర్, మంత్రి సైకిల్ పై సవారీ చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy