సైనాపై సింధు గ్రాండ్ విక్టరీ

saina-nehwal-and-pv-sindhuఇండియా ఓపెన్‌లో భారత టాప్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌,  పీవీ సింధుల పోరు అందరినీ ఆకట్టుకుంది. హోరాహోరీగా సాగిన పోరులో తొలిసెట్ ను గెలుచుకుంది సింధు. 21-16తో సైనాను వెనక్కి నెట్టేసింది. రెండో సెట్ లోనూ ఇద్దరి మధ్య పోరు ఢీ అంటే ఢీ అన్నట్టు సాగింది. తొలుత సైనా లీడ్ లో ఉండగా… తర్వాత విజయం సింధూనే వరించింది. రెండో సెట్ లో 22-20తో సైనాను ఓడించిన సింధు.. సెమీ ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ఇద్దరి పోరు 45 నిమిషాల పాటు సాగింది. సెమీస్ లో కొరియన్ ప్లేయర్ సంగ్ జి హ్యూన్ తో తలపడనుంది సింధు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy