సైనా, సింధు,శ్రీకాంత్ లపైనే ఆశలు : నేటి నుంచే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్

sdప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ షిప్ కు రంగం సిద్దమైంది. 17 ఏళ్లుగా భారత్‌ను ఊరిస్తున్న ఈ ట్రోఫీని గెలుచుకునేందుకు భారత షట్లర్లు రెడీ అయ్యారు. పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌పైనే టైటిల్ ఆశలున్నాయి. ఆల్‌ ఇంగ్లండ్ ట్రోఫీని భారత్ తరపున ప్రకాశ్ పదుకోణ్ 1980లో, పుల్లెల గోపీచంద్ 2001లో గెలుచుకున్నారు. ఆ తర్వాత ఈటోర్నీలో సైనా పదిసార్లు పాల్గొన్నప్పటికీ 2015లో రన్నరప్‌గా నిలిచింది. అయితే ఐదుసార్లు ఈ టోర్నీ ఆడిన సింధు 2017లో క్వార్టర్ ఫైనల్ వరకు చేరగలిగింది.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత్ ఆశాకిరణం కిడాంబి శ్రీకాంత్ ఫ్రాన్స్ ఆటగాడు బ్రీస్ లెవర్డెజ్‌తో పోటీపడనున్నాడు. ప్రపపంచ నంబర్ వన్ విక్టర్ అక్సెల్‌ సెన్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో శ్రీకాంత్‌కు కలిసిరానుంది. సాయిప్రణీత్, ప్రణయ్ కూడా పురుషుల సింగిల్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి జోడి, పురుషుల డబుల్స్‌లో చిరాగ్‌శెట్టి, సాత్విక్ జోడి, మిక్స్‌డ్ డబుల్స్‌లో జెర్రీ చోప్రా, సిక్కిరెడ్డి పోటీకి దిగుతున్నది. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన 1.15మీటర్ల సర్వీస్ నిబంధనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన సమయంలో ఎంతవరకు అవి ఈ టోర్నీలో ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది. సర్వీస్ చేసేటపుడు షటిల్‌కు రాకెట్ 1.15మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో తాకొద్దని కొత్త నిబంధన ప్రవేశపెట్టడంతో ఇది పొడుగ్గా ఉన్న ఆటగాళ్లకు ఇబ్బందికరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. సింధుకు ఈ నిబంధన ఇబ్బందికరం కాగా, సైనాకు కొంత అనుకూలంగా ఉండనుంది.
పురుషుల సింగిల్స్: శ్రీకాంత్ x లెవర్డెజ్, ప్రణయ్ x తియెన్ చెన్, ప్రణీత్ x సాన్‌వాన్ హో.
మహిళల సింగిల్స్: సైనా x తై తెజు యింగ్, సింధు x చాచువాంగ్
పురుషుల డబుల్స్: మను-సుమీత్ రెడ్డి x ఎలిస్-లాంగ్‌రిడ్జ్. చిరాగ్ – రాంకిరెడ్డి x హొకి – కొబయాషి.
మహిళల డబుల్స్: మేఘన – పూర్వీషా x తనకా, యొనెమొటో. అశ్విని – సిక్కిరెడ్డి x మట్సుటొమో – టకహషి

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy