సైనికులపై కారు బీభత్సం..ఆరుగురికి గాయాలు

pariscarడ్యూటీలో ఉన్న సైనికులపైకి వేగంగా ఓ కారు దూసుకెళ్లడంతో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన  ఫ్రాన్స్ రాజ‌ధాని ప్యారిస్‌లోని లెవాల్లోయిస్ – పెర్రెట్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సైనికుల‌పై దాడికి పాల్ప‌డిన వాహ‌నం గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గురిచేసిన BMW కారును గుర్తించిన పోలీసులు..  దాని కోసం గాలిస్తున్నారు. ఉగ్రవాది ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై లెవల్లాయిస్‌-పెరెట్‌ మేయర్‌ పాట్రిక్‌ బాల్కెనీ స్పందించారు. జవాన్లపై బీఎండబ్ల్యూ కారు దూసుకెళ్లడం తాను చూశానని.. ఇది ఉద్దేశపూర్వకంగానే చేసిన ప్రమాదమని పాట్రిక్‌ అన్నారు. చాలాసేపటి నుంచి ఆ కారు హెడ్‌క్వార్టర్స్‌ బయటే ఉందని.. భవనం నుంచి జవాన్లు బయటకు రాగానే వారిపైకి దూసుకెళ్లిందని పాట్రిక్‌ వెల్లడించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy