సైన్స్, టెక్నాలజీతోనే సుపరిపాలన: మోడీ

MODI (2)ప్రజా సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా శాస్త్రవేత్తలు పనిచేయాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సాధికారత, ఉపాధి అవకాశాల మెరుగులో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చామన్నారు. ఆహారం, ఆరోగ్యం ప్రమాణాలు మెరుగుపర్చడంలో సఫలమయ్యామని తెలిపారు. కర్ణాటకలోని మైసూర్‌లో ఏర్పాటు చేసిన 103వ భారతీయ విజ్ఞాన సదస్సును మోడీ ప్రారంభించారు. ఈ ఏడాది మొదట్లో విజ్ఞాన సదస్సు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గొప్ప నేతలంతా మైసూరు విశ్వవిద్యాలయంలో చదువుకున్న వారేనన్నారు ప్రధాని.

ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌, మైసూరు విశ్వవిద్యాలయం ప్రయాణం ఒకేసారి ప్రారంభమైందన్న మోడీ… మైసూరు విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల టైంలో సదస్సు జరగటం సంతోషంగా ఉందన్నారు. సైన్స్, టెక్నాలజీతోనే సుపరిపాలన సధ్యమన్నారు. 2030 నాటికి పేదరిక నిర్మూలన, అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలవటమే లక్ష్యమని స్పష్టం చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. సైన్స్ కేవలం పరిశోధనలకే పరిమితం కాకుండా… శాస్త్రీయ దృక్పథం కూడా పెపొందాలని తెలిపారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా టెక్నాలజీ విజన్‌-2035 డ్యాక్యుమెంట్‌ను ప్రధాని ఆవిష్కరించారు. 30 మంది శాస్త్రవేత్తలకు ప్రధాని చేతులమీదుగా పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి హర్షవర్దన్‌, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, దేశ విదేశాలకు చెందిన 10వేల మంది శాస్త్రవేత్తలు సదస్సులో పాల్గొన్నారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy