సైమా నామినేషన్స్ విడుదల

టాలీవుడ్ స్టార్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురురూస్తున్న సైమా అవార్డ్ వేడుక త్వరలోనే జరగనుంది. ఈ సందర్భంగా నామినేషన్స్ విడుదల చేశారు. సౌత్ స్టార్స్ అంతా ఒకే చోట చేరి సందడి చేసే సైమా వేడుక ప్ర‌తి సంవ‌త్స‌రం అంగ‌రంగ వైభవంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌కి సంబంధించిన సెల‌బ్రిటీలు ఈ వేడుక‌కి హాజ‌రు కానున్నారు. న‌టీమ‌ణుల గ్లామ‌ర్ తో , రాక్ ప‌ర్ఫార్మెన్స్ తో, సెల‌బ్రిటీల ఆట పాట‌ల‌తో సైమా వేడుక ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు ఎడిష‌న్స్ పూర్తి చేసుకున్న సైమా ఈ ఏడాది దుబాయ్‌ లో ఏడో ఎడిష‌న్ జ‌రుపుకోనుంది. సెప్టెంబ‌ర్ 14, 15వ తేదీల‌లో సైమా వేడుకని ఘ‌నంగా నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు తెలిపారు నిర్వాహకులు. అయితే 2017 సంవ‌త్స‌రంలో విడుద‌లైన చిత్రాల‌కి సంబంధించి నామినేష‌న్స్ సోమవారం (ఆగస్టు-6) ప్ర‌క‌టించారు. ఇందులో తెలుగోడి ఖ్యాతిని విశ్వ‌వ్యాప్తం చేసిన బాహుబలి ది కన్‌క్లూజన్‌ 12 విభాగాల్లో నామినేషన్లను దక్కించుకుంది. వివిధ కేటగిరీల‌లో నామినేష‌న్స్ ద‌క్కించుకున్న సినిమాలు, హీరోల వివ‌రాలు ఇలా ఉన్నాయి.
ఉత్తమ సినిమా

– బాహుబలి ది కన్‌క్లూజన్‌
– ఫిదా
– గౌతమీపుత్ర శాతకర్ణి
– ది ఘాజీ ఎటాక్‌
– శతమానం భవతి

ఉత్తమ డైరెక్టర్

– క్రిష్‌(గౌతమీపుత్ర శాతకర్ణి)
– SS రాజమౌళి(బాహుబలి2)
– సందీప్‌ వంగా(అర్జున్‌ రెడ్డి)
– సంకల్ప్‌ రెడ్డి(ది ఘాజీ ఎటాక్‌)
– సతీష్‌ వేగేశ్న(శతమానం భవతి)

ఉత్తమ నటుడు

– నందమూరి బాలకృష్ణ(గౌతమీపుత్ర శాతకర్ణి)
– ప్రభాస్‌(బాహుబలి2)
– విజయ్‌ దేవరకొండ(అర్జున్‌ రెడ్డి)
– NTR (జై లవ కుశ)
– రానా దగ్గుబాటి(నేనే రాజు నేనే మంత్రి)

ఉత్తమ నటి

– అనుష్క(బాహుబలి2)
– రకుల్‌ ప్రీత్‌ సింగ్‌(జయ జానకీ నాయక)
– కాజల్‌(నేనే రాజు నేనే మంత్రి)
– రితికా సింగ్‌(గురు)
– సాయిపల్లవి(ఫిదా)

ఉత్తమ సహాయనటుడు

– ఆది పినిశెట్టి(నిన్నుకోరి)
– ప్రకాష్‌ రాజ్‌(శతమానం భవతి)
– కేకే మేనన్‌(ది ఘాజీ అటాక్‌)
– సత్య రాజ్‌(బాహుబలి2)
– శ్రీవిష్ణు(ఉన్నది ఒకటే జిందగీ)

ఉత్తమ సహాయనటి

– భూమిక ( MCA)
– జయసుధ(శతమానంభవతి)
– రమ్యకృష్ణ(బాహుబలి2)
– హేమమాలిని(గౌతమీ పుత్ర శాతకర్ణి)
– రాధిక(రాజా ది గ్రేట్‌)

ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్

– SS ‌తమన్‌(మహానుభావుడు)
– దేవి శ్రీ ప్రసాద్‌(ఖైదీ నంబర్‌ 150)
– MM కీరవాణి(బాహుబలి2)
– శక్తికాంత్‌(ఫిదా)
– గోపీ సుందర్‌(నిన్నుకోరి)

ఉత్తమ విలన్

– రానా దగ్గుబాటి( బాహుబలి2)
– తరుణ అరోరా( ఖైదీ నంబరు 150)
– రావు రమేష్‌(DJ దువ్వాడ జగన్నాథమ్‌)
– అర్జున్‌(లై)
– విజయ్‌ వర్మ(MCA)

ఉత్తమ కమెడియన్

– రాహుల్‌ రామకృష్ణ(అర్జున్‌ రెడ్డి)
– శ్రీనివాస్‌ రెడ్డి(ఆనందో బ్రహ్మ)
– ప్రవీణ్‌ (శతమానం భవతి)
– బ్రహ్మానందం(ఖైదీ నంబర్‌ 150)
– షకలక శంకర్‌(ఆనందో బ్రహ్మ)

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy