సైమా వేడుకల్లో అఖిల్ హంగామా

unnamedఅబుదాబిలో అట్టహాసంగా జరిగిన సైమా వేడుకల్లో అఖిల్ అక్కినేని పాటతో అదరగొట్టాడు. దక్షిణాది తారలంతా సందడి చేసిన ఈ వేడుకల్లో అందాల భామలు అదిరేటి స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ వేడుకల్లో అఖిల్‌ అక్కినేని ఇచ్చిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన మొదటి సినిమాతోనే నటుడిగా, డ్యాన్సర్‌గా ఆకట్టుకున్న ఈ యువ కథానాయకుడు.. సైమా వేదికపై గాయకుడిగానూ ప్రూవ్ చేసుకున్నాడు. దీన్ని ప్రత్యక్షంగా తిలకించిన అతడి తండ్రి అక్కినేని నాగార్జున పుత్రోత్సాహంతో పరవశించిపోయాడు. ఈ ప్రదర్శన నాగ్‌కు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందట. తాజాగా ఆయన ట్విటర్ ద్వారా అఖిల్‌కు అభినందలు తెలిపాడు. ‘సైమా 2017 వేదికపై అఖిల్ పాడుతుండగా నేను అక్కడే ఉన్నాను…. ఈ ప్రదర్శన కోసం అఖిల్ ఎంతో సాధన చేశాడు’ అంటూ  ట్వీట్ చేశాడు నాగ్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy