సై అంటే సై : కల్వకుర్తి లిఫ్ట్ పై బహిరంగ యుద్ధం

teluguకల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో నీటి లభ్యత, ఆయకట్టు విషయంపై టీఆర్ఎస్ – కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం బహిరంగ చర్చకు దారితీసింది. టీఆర్ఎస్ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి, కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి కలిసి చర్చకు కూర్చోవటం ఆసక్తి రేపింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా ఎదుట ఇద్దరు నేతలు చర్చకు దిగారు.

వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే, కల్వకుర్తి, కాంగ్రెస్

కల్వకుర్తి ఆయకట్టు నుంచి మా ప్రాంతాన్ని తొలగించారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే  వంశీచంద్. ఘనపురం రిజర్వాయర్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్నారు.  D 82 కాలువకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యం కల్పించలేదన్నారు. ఘనపురం రిజర్వాయర్ కే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. డి82 పొడవు, వెడల్పు పెంచాలని డిమాండ్ చేశారు. డి82 కాలువ సామర్ధ్యం తక్కువగా ఉంచారన్నారు. 2014 వరకే 90 శాతం నిధులు ఖర్చుపెట్టారు.. తర్వాత పట్టించుకోలేదన్నారు. 2016 నాటికి ఖరీఫ్ నీళ్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఆ తర్వాత పట్టించుకోలేదని ఆరోపించారు. 159-160 కిలోమీటర్ మధ్య 22 క్యూసెక్కుల ప్రవాహం ఉంటే.. 160కిలోమీటర్ దాటిన తర్వాత 6.6క్యూసెక్కులకు ప్రవాహం తగ్గిపోవటం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ జీవో ప్రకారం.. కల్వకుర్తి ఆయకట్టుకు అన్యాయం జరుగుతుందన్నారు. ఖరీఫ్ కు నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పటి వరకు అలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.

నిరంజన్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, టీఆర్ఎస్ నేత

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి కావడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదన్నారు. కల్వకుర్తికి నికర జలాల కేటాయింపు లేదన్నారు. కేవలం ఈ ప్రాజెక్టును వరద జలాలను ఆపుకోవడానికి ఉద్దేశించిందని స్పష్టం చేశారు. డి-82 కాలువకు.. ఘనపూర్ రిజర్వాయర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పాలమూరు జిల్లా అంతా సమానమే అన్నారు. కల్వకుర్తి పూర్తి కాకుండా అడ్డుకుంటుంది కాంగ్రెసేనన్నారు. 2012లో అప్పటి ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సామర్థ్యం 25 TMCలు కేటాయించిందన్నారు. ఆనాటి ప్రభుత్వం కేవలం కిలో మీటరు తొవ్వి వదిలేశారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మూడు కోట్లతో సర్వే నిర్వహించి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంను 40 TMC లకు పెంచామన్నారు. 3లక్షల 40వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వాలనే ధృడ సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ ను చేపట్టామన్నారు. ఇప్పటికే డిండి ప్రాజెక్ట్ వరకు నీళ్లు వచ్చాయన్నారు. కల్వకుర్తి, వనపర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల ప్రజలకు మంచినీళ్లు అందించామన్నారు. గత ప్రభుత్వం కంటే 25వేల ఎకరాల ఆయకట్టును ఒక్క కల్వకుర్తి కిందనే పెంచామన్నారు నిరంజన్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy