సొంతగడ్డపై ఢిల్లీ జయకేతనం

Vivo IPL 2017 M15 - DD v KXIPసొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఢిల్లీ డేర్‌డెవిల్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది. 51 పరుగుల తేడాతో పంజాబ్స్ కింగ్స్ ఎలవెన్ పై విజయకేతనం ఎగరవేసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మోరీస్ 3 వికెట్లు తీయగా.. కమిన్స్, నదీమ్ చెరో రెండు వికెట్లు, మిశ్రా, అండర్ సన్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇటు బౌలర్లు… అటు బ్యాట్స్ మెన్ సమిష్టి కృషితో విజయం సాధించింది ఢిల్లీ.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. శామ్ బిల్లింగ్స్ (55), కోరె అండర్సన్ (40 నాటౌట్) నిలకడగా ఆడటంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో వరుణ్ అరోన్ రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, మోహిత్ శర్మ, అక్షర్ పటేల్, కరియప్ప తలో వికెట్ తీశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy