సోనాలి ట్వీట్ : నొప్పిని భరించలేకపోతున్నా..

క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే.. ప్రస్తుతం న్యూయార్క్‌ లో  ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అయితే ట్రీట్ మెంట్ తీసుకునే సమయంలో చాలా నొప్పిని భరిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా తన ఆవేదనను తెలుపుతూ ట్విట్టర్ లో ఓ పోస్ట్‌ చేశారు. దీంతో పాటు ఓ ఫొటోను షేర్‌ చేశారు.

కొన్ని నెలలుగా తనకు మంచి, చెడు రెండూ ఎదురయ్యాయని..దీంతో చాలా బలహీనపడిపోయానని తెలిపారు. చేతి వేలు పైకి ఎత్తడానికి శక్తిలేక బాధపడ్డానని చెప్పారు. శారీరకంగా ప్రారంభమైన ఈ నొప్పి.. మానసికంగా, ఎమోషనల్‌ గా దెబ్బతీస్తోందన్నారు. కీమో థెరపీ, సర్జరీ తర్వాత కొన్ని రోజులు చాలా కష్టమైందని.. కనీసం నవ్వినా నొప్పి వచ్చేదని ట్వీట్ చేశారు సోనాలి.  ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు సోనాలి భర్త గోల్డీ బెహెల్‌.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy