సోనియాగాంధీ హాజరయ్యే సభలో పాల్గొంటా : కోదండరాం

పీపుల్స్ ఫ్రంట్ లో స్నేహపూర్వక పోటీని విరమించుకునే అంశంపై చర్చలు జరుగుతున్నాయన్నారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం. హైదరాబాద్ లో ఆయన టీజేఎస్ తరఫున మేనిఫెస్టో ప్రకటించారు. సోనియాగాంధీ సభకు తనను కూడా రమ్మని పిలిచారని.. వెళ్తానని చెప్పారు. తాము 14 మందికి బీఫామ్ లు ఇచ్చామనీ.. కాంగ్రెస్ హైకమాండ్ 8 సీట్లే ఇచ్చిందన్నారు. ఇంకో 2 సీట్ల విషయంలో కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వలేదన్నారు. గందరగోళంగా ఉండడం వలన మైనార్టీలకు సీట్లు ఇవ్వలేక పోయామన్నారు.

ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో లేట్ అయ్యిందన్నారు కోదండరామ్. జనగామ సీట్ విషయంలో ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అని వద్దనుకున్నానని చెప్పారు. మాపార్టీ ని చంపుకునే పని మేము ఏరోజు చెయ్యము అని చెప్పారు. కూటమి వల్ల ప్రత్యామ్నాయం ఉంది అని నమ్మకం ప్రజలకు కలిగిందని చెప్పారు.

“కూటమి ధర్మాన్ని అందరూ పాటించాలి. ప్రజలు చూసేవి అభ్యర్థి, పార్టీ, అభివృద్ధి, ప్రత్యర్థి ఎవరని మాత్రమే. డబ్బులు ఎవరు చూడరు. కాంగ్రెస్ చేసే కొన్ని తప్పుల వలన అధికారపక్షం లాభం చేకూరేలా ఉంది. ఒక బీసీ నాయకుని కోసం మేము సీట్ వదులుకుంటే… మిర్యాలగూడ సీట్ విషయంలో మా అభ్యర్ధికి బదులుగా బీసీ నాయకుడికి సీట్ ఇవ్వడం న్యాయం కాదు” అన్నారు కోదండరాం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy