సోనియా, రాహుల్ కు ఢిల్లీ కోర్టు సమన్లు..

sonai-rahul-caseకాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సోనియాగాంధీకి, వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు సమన్లు జారీ చేసింది. ‘నేషనల్ హెరాల్డ్’ కేసులో ఆగస్టు 7 న హాజరు కావాలని వీళ్ళిద్దరినీ కోర్టు ఆదేశించింది. బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి ఈ కేసు వేశారు.  ‘యంగ్ ఇండియన్స్’ అనే కంపెనీని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఏర్పాటు చేసి….దాని ద్వారా ‘నేషనల్ హెరాల్డ్’ న్యూస్ పేపర్ ను చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేశారన్నది స్వామి ఆరోపణ. ‘నేషనల్ హెరాల్డ్’  పేపర్ ను పబ్లిష్ చేసే అసోసియేటెడ్ జర్నల్స్ అనే కంపెనీకి 1600 కోట్లకుపైగా ఆస్తులున్నాయి. ఇంత మొత్తంలో ఆస్తులున్న సంస్థను జస్ట్ 50 లక్షల రూపాయలకు సోనియా, రాహుల్ కొన్నారని స్వామి అంటున్నారు.

2008 లో మూతపడిన ‘నేషనల్ హెరాల్డ్’ పేపర్ ను సోనియా మళ్ళీ మొదలుపెట్టడానికి ప్రయత్నించారని, దీనికోసం, కాంగ్రెస్ పార్టీ ఆమెకు 90 కోట్ల అప్పు ఇచ్చిందని స్వామి ఆరోపణ. వ్యాపారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కు పార్టీ ఇలా అప్పు ఇవ్వడమేంటని స్వామి ప్రశ్నిస్తున్నారు. మొదటిసారి సుబ్రమణ్యస్వామి 2012 లో ఈ ఆరోపణలు చేశారు. అప్పట్లో రాహుల్ గాంధీ దాన్ని ఖండించారు. అయితే, ఈ కేసు విషయంలో సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టు నమ్మిందని, అందుకే సమన్లు జారీ అయ్యాయిని స్వామి ఇప్పుడు చెప్తున్నారు. ఈ కేసులో కాంగ్రెస్ లీడర్లు ఆస్కార్ ఫెర్నాండెజ్, మోతీలాల్ వోరా, టెలికామ్ నిపుణుడు శామ్ పిట్రోడా, జర్నలిస్టు సుమన్ దూబేకి కూడా సమన్లు జారీ అయ్యాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy