సోషల్ మీడియా ద్వారా యూత్ ను ట్రాప్ చేస్తున్న ఐసీస్..!

Fighters of  al-Qaeda linked Islamic State of Iraq and the Levant parade at Syrian town of Tel Abyadఐసీస్ లో చేరితే రూ.20 నుంచి 30 లక్షల వరకు ఆఫర్

ఈజీగా ఐసీస్ కు అట్రాక్ట్ అవుతున్న యూత్

మరోసారి ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులు సిటీలో కలకలం రేపారు. పది మంది యువకులకి భారీగా డబ్బు ఎరవేసి.. సంస్థలోకి లాక్కునే ప్రయత్నం చేశారు. వారిని వయా దుబాయ్… సిరియాకి తరలించేందుకు ప్లాన్ చేశారు. అయితే ముందే కనిపెట్టిన ఇంటెలిజెన్స్ సిరియా వెళ్లేందుకు రెడీ అయిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న యువకులకి కౌన్సిలింగ్ ఇచ్చి వారి పేరెంట్స్ కి అప్పగించారు పోలీసులు. ఇషాక్ అలీ, అబ్దుల్ మతీన్, రెహమాన్ సాజీద్,  అరుణ్ మహ్మద్, ముతీ ఊర్ రెహమాన్, రెహమాన్ జైద్, వజీర్ మున్వర్ సల్మాన్, మహ్మద్ లతీఫ్ ఉద్దీన్, అబ్దుల్ హదీ ఖురేష్ లను సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేసినట్లు గుర్తించారు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ని బట్టి 20 నుంచి 30 లక్షల వరకు ఆఫరిచ్చినట్లు చెబుతున్నారు.

ఇక సిటీ నుంచి చదువుల కోసం ఫారిన్ వెళ్లే చాలా మంది ఐఎస్ ఐఎస్ పై ఇంట్రస్ట్ చూపించడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మాస్టర్ డిగ్రీ కోసం లండన్ వెళ్లిన శాస్త్రీ పురానికి చెందిన ఓ యువకుడు పది రోజుల క్రితం ఉగ్రవా యుద్ధంలో చనిపోయాడు. గతంలోనూ ఐఎస్ ఐఎస్ బాట పట్టిన ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిలో మహిళలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. వస్తోన్న రిపోర్టులు.. దొరుకుతోన్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని.. ఎయిర్ పోర్ట్ పై నిఘా పెంచారు పోలీసులు. జాబ్ తో పాటు.. ఏ రీజన్ తో విదేశాలకు వెళ్తోన్న వారి వివరాలు అన్నీ సేకరిస్తున్నారు. వెళ్లి వేరే దేశాల్లో ఉంటున్న వారు కూడా ఎక్కడుంటున్నారనే విషయంపై ఫాలో అప్ చేస్తున్నారు. గతంలో దొరికి బయటికెళ్లిన వారి కదలికలపైనా ఫోకస్ చేశారు. సిటీలోని హోటల్స్, లాడ్జీలతో పాటు.. అన్ని షెల్టర్లపైనాన మైక్రోస్కోపేసింది ఇంటెలిజెన్స్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy