
ఇలా హైదరాబాద్, బెంగళూరు, పూణే, కోల్‌కతా, చెన్నై నగరాల్లో పనిచేస్తూ హఠాత్తుగా ఉద్యోగాలనుంచి తొలగించబడిన ఎంప్లాయిస్ అంతా సోషల్‌మీడియా వేదికగా ఏకమయ్యారు. ఫేస్బుక్ వాట్సాప్‌లలో ఎవరికి తోచినట్లుగా వారు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగుల మెడపై కత్తివేలాడతీయడం అన్యాయమని వీరు సోషల్‌మీడియా ద్వారా ట్రంప్ విధానాలను ఎండగట్టాలని భావిస్తున్నారు.
ఉద్యోగుల తొలగింపుపై ఐటీ ఎంప్లాయిస్ చాలా సీరియస్‌గా ఉన్నారని పంకజ్‌సింగ్ అనే సాఫ్ట్వేర్ అనలిస్ట్ అన్నారు. రెండేళ్లుగా కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్న పంకజ్సింగ్ను తొలగించింది కాగ్నిజెంట్ సంస్థ. ట్రంప్ విధానాలు చాలా మంది ఐటీ ఉద్యోగుల కడుపును కొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద సంస్థలు భారతీయ ఐటీ ఉద్యోగులను తొలగిస్తున్నాయని అయితే.. ఆ కంపెనీలు చెప్పే సంఖ్య ఒకలా ఉంటే వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఐటీ ఎంప్లాయిస్ వెల్లడించారు.