స్కాట్లండ్ విభజనపై 18న ప్రజా తీర్పు..

> on August 27, 2014 in Dundee, Scotland.విభజించు…..పాలించు అనే సిద్ధాంతాన్ని అనేక దేశాల్లో సక్సెస్ ఫుల్ గా అమలు చేసిన గ్రేట్ బ్రిటన్ కే  ఇప్పుడు  విభజన సెగ తగిలింది. విభజన ఇష్యూ పై ఈనెల 18న  స్కాట్లండ్ లో జరిగే రెఫరెండం పై యూరప్ ప్రజల్లో   ఉత్కంఠ నెలకొంది. మూడు వందల ఏళ్లుగా సాగుతున్న బంధాన్ని తెంపొద్దని స్కాట్లండ్ ప్రజలను వేడుకున్నారు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్. 1707లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో యునైటెడ్ కింగ్ డమ్ లో చేరింది స్కాట్లండ్. మూడు వందల ఏళ్ల నుంచి యూకేలో ఉన్నా ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నారు స్కాట్లండ్ ప్రజలు. అయితే,  ప్రత్యేక దేశంగా అవతరించాలన్న స్కాట్లండ్  ప్రజల పోరాటాలను దారుణంగా అణచివేశాయి యునైటెడ్ కింగ్ డమ్ బలగాలు.

పేరుకు గ్రేట్ బ్రిటన్ లో కలిసే ఉన్నా స్కాట్లండ్ ప్రజల కల్చర్ వేరు. భాష కూడా కొంత డిఫరెంట్. బ్రిటన్ ప్రజలకు స్కాట్లండ్ భాష అన్నా,  అక్కడి  ప్రజల కల్చర్ అన్నా చాలా చిన్న చూపు. యునైటెడ్ కింగ్ డమ్ లో కలిసి ఉన్నా, స్కాట్లండ్ కు సెపరేట్ గా ఒక గవర్నమెంట్ ఉంది. అయితే, ఈ సర్కార్ కు  పెద్దగా పవర్స్ ఏమీ  ఉండవు. పిల్లల చదువులు, ఆరోగ్యం వంటి  ఇష్యూస్ కే  పరిమితం అయి ఉంటుంది.  ఏ పథకానికి  ఎంత డబ్బు అలాట్ చేయాలి, దేని మీద ఎంత పన్ను వేయాలి…..ఇవన్నీ యూకే  సర్కారే  చూసుకుంటుంది.

Scottish independence supporters with flagఆర్థిక మాంద్యం సాకు చూపి స్కాట్లండ్ లో వెల్ఫేర్ యాక్టివిటీస్ కు చాలా తక్కువ ఫండ్స్ కేటాయించాయి బ్రిటన్  ప్రభుత్వాలు. బ్రిటన్ లో మాత్రం సంక్షేమానికి  పెద్ద ఎత్తున నిధులు కేటాయించాయి. అంతేకాదు రాబడి    పెంచుకోవడానికి స్కాట్లండ్ ప్రజలపై ఎడా పెడా పన్నులు వేశాయి. వాస్తవానికి, స్కాట్లండ్ సముద్ర తీర ప్రాంతంలోని ఆయిల్ బావుల నుంచి గ్రేట్ బ్రిటన్ కు పెద్ద ఎత్తున ఆదాయం వెళ్తుంటుంది. అయితే, ఖజానా నింపడంలో  మేజర్ రోల్  పోషిస్తున్నా యూకే సర్కార్ తమ నోట్లో మట్టి కొడుతున్నదని డిసైడ్ అయ్యారు స్కాట్లండ్  ప్రజలు.

గ్రేట్ బ్రిటన్ సర్కార్ నిర్ణయాలను అనేక సార్లు స్కాట్లండ్ ప్రజలు విభేదించారు. దీంతో, యూకే నుంచి విడిపోవాలన్న కోరిక స్కాట్లండ్  ప్రజల్లో బలంగా నాటుకుంది. స్వతంత్ర దేశంగా అవతరిస్తే,  తమ వనరులను తామే ఉపయోగించుకోవచ్చనీ,  ఫైనాన్షియల్ గా ఎవరి మీదా డిపెండ్ కానక్కర్లేదని డిసైడ్ అయ్యారు స్కాట్లండ్ ప్రజలు.

1934లో ఏర్పడ్డ స్కాటిష్ నేషనల్ పార్టీ స్కాట్లండ్ ప్రజలకు అండగా నిలబడింది.  విడిపోవాలన్న కోరికను  ప్రజల్లో  బలంగా నాటుకునేలా చేసింది. హోమ్ రూల్ పేరుతో ఆందోళనా కార్యక్రమాలను ఉదృతం చేసింది.  స్కాటిష్  నేషనల్  పార్టీ  ఉద్యమాల కారణంగానే, యూకే సర్కార్ కొంత మేర దిగి వచ్చింది. 1997లో కొన్ని అధికారాలతో  స్కాట్లండ్ లో ఓ ప్రభుత్వం ఏర్పాటుకు ఓకే చెప్పింది. స్కాట్లండ్ ప్రజలు సొంతంగా పార్లమెంటును ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా కల్పించింది. ఈ పార్లమెంటుకు స్కాటిష్ నేషనల్  పార్టీ, ప్రస్తుతం నాయకత్వం వహిస్తుంది. ప్రస్తుతం స్కాట్లండ్ ప్రజల ఉద్యమాన్ని నడుపుతున్నది అదే పార్టీకి చెందిన ప్రధాని అలెక్స్ సాల్మండే కావడం విశేషం.

స్కాట్లండ్ కు ఇండిపెండెన్స్  కావాలా?  వద్దా?  అనే ప్రశ్నపై రెఫరెండం నిర్వహించడానికి గతేడాదే రంగం సిద్ధం చేసింది. స్కాటిష్ ఇండిపెండెన్స్ రెఫరెండం బిల్లును ప్రిపేర్ చేసింది. ఈ రెఫరెండంలో మెజారిటీ ప్రజలు ఎస్ అంటే యూకే నుంచి స్కాట్లండ్  విడిపోయినట్లే. వాల్డ్  మ్యాప్ పై మరో కొత్త దేశం ఏర్పడుతుంది.

ఈనెల 18న నిర్వహించే ఈ రెఫరెండంలో నలభై లక్షల మందికి  పైగా  తమ  అభిప్రాయాన్ని తెగేసి చెప్పడానికి  రెడీ అయ్యారు. పదహారేళ్లు దాటిన ప్రతి ఒక్క స్కాటిష్  సిటిజన్ ఈ రెఫరెండంలో  పాల్గొనవచ్చు.

గ్రేట్ బ్రిటన్ నుంచి విడిపోవడానికే మెజారిటీ స్కాట్లండ్ ప్రజలు  ఇంట్రెస్ట్ చూపుతున్నారని లేటెస్ట్ గా జరిపిన ఓ సర్వేలో వెల్లడైంది. దీంతో,  బ్రిటన్ ప్రధాని డేవిడ్  కామెరూన్ హుటాహుటిన  స్కాట్లండ్ వెళ్లి  అక్కడి ప్రజలను  కూల్ చేసే ప్రయత్నాలు  మొదలెట్టారు. ప్లీజ్  విడిపోవద్దంటూ ప్రాధేయ పడ్డారు. ఒక దశలో విడిపోతే, స్వతంత్రంగా మీరు బతకలేరంటూ స్కాట్లండ్  ప్రజలను హెచ్చరించారు కూడా.

స్కాట్లండ్ ఓ అందమైన దేశం. స్కాట్లండ్  అనగానే ఎవరికైనా  ఠక్కున గుర్తుకు వచ్చే పేరు  షేక్ స్పియర్.  ప్రక్రుతి సోయగాలకు  స్కాట్లండ్ పుట్టిల్లు.  స్కాట్లండ్  అందాలు చూడటానికి  ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు టూరిస్టులు. డ్రస్ విషయంలో స్కాట్లండ్ ప్రజల రూటే వేరు. చూడటానికి పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది.  అలాగే  స్కాట్లండ్ లోని బ్యాగ్ పైపర్ మ్యూజిక్ కూడా వాల్డ్ ఫేమస్.

విభజనకు మెజారిటీ ప్రజలు  ఎస్ అంటే…..  నష్టపోయేది  యునైటెడ్  కింగ్ డమే కానీ,  స్కాట్లండ్  ఎంతమాత్రం కాదు.  యూకే ఆర్థిక వ్యవస్థ  ఘోరంగా  దెబ్బతింటుంది. అదే జరిగితే,  రెసిషన్ నుంచి  ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న  యూరప్ కూడా  డేంజర్ జోన్ లో పడ్డట్లే.

స్కాట్లండ్ విడిపోతే,  ఆ ప్రభావం యునైటెడ్  కింగ్ డమ్ లోని మిగతా దేశాలపై కూడా పడే అవకాశాలున్నాయి. ఐర్లాండ్ లోని  మెజారిటీ ప్రాంతం 1922లోనే  యునైటెడ్  కింగ్ డమ్ నుంచి వేరు పడింది.  రిపబ్లిక్ ఆఫ్  ఐర్లాండ్  పేరుతో స్వతంత్ర దేశంగా ఏర్పడింది. ఇప్పుడు ఐర్లాండ్ లోని  ఓ చిన్న భాగం మాత్రమే గ్రేట్ బ్రిటన్ లో కలసి ఉంది.  స్కాట్లండ్ రెఫరెండంతో గ్రేట్ బ్రిటన్ పాలిటిక్స్ హీటెక్కాయి. స్కాట్లండ్ విడిపోతే, ఎవరికి నష్టం ఎవరికి లాభం అని లెక్కలు వేసుకుంటున్నాయి  బ్రిటన్ పొలిటికల్  పార్టీలు. 18న యునైటెడ్  కింగ్ డమ్  ఫ్యూచర్  పై  తీర్పు చెప్పబోతున్నారు స్కాట్లండ్  ప్రజలు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy