స్కూటీని ఢీ కొట్టిన ఇన్నోవా…విద్యార్థి మృతి

పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఓ బీటెక్‌ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం కొండమడుగుమెట్టు దగ్గర జాతీయ రహదారిపై గురువారం (ఆగస్టు-9) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కుషాయిగూడకు చెందిన నేలపట్ల శివగౌడ్‌(18) యాదగిరిగుట్టలోని తన అమ్మమ్మ ఇంటి  దగ్గర ఉంటూ భువనగిరి ఆరోరా ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌  సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఘట్‌కేసర్‌ మండలం అవుషాపూర్‌ లోని వీబీఐటీ కాలేజీలో పరీక్ష రాసేందుకు తన స్నేహితులు చిన్నరావులపల్లికి చెందిన భరత్, సాయిరాంలతో కలసి ఒకే స్కూటీపై బయలుదేరారు. ఈ క్రమంలో సర్వీస్‌ రోడ్డు గుండా వస్తున్న వీరు కొండమడుగు మెట్టు దగ్గర మెయిన్ రోడ్డుపై నుంచి మరో సర్వీస్‌ రోడ్డులోకి క్రాస్‌ అవుతుండగా ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనం వీరి స్కూటీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో శివగౌడ్‌ అక్కడికక్కడే మృతి చెందగా సాయికుమార్, భరత్‌లు తీవ్రంగా గాయపడ్డారు.

ఇన్నోవా స్కూటీని ఢీకొట్టిన సమయంలో రోడ్డు పక్కనే బస్సు కోసం ఎదురు చూస్తున్న కొండమడుగు పరిధిలోని మాధవరెడ్డి కాలనీకి చెందిన దొరబాబుకు స్కూటీ వెళ్లి తగలడంతో అతనికి కూడా గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా వాహనం మిషన్‌ భగీరథ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారిదిగా తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించారు.

విద్యార్థి శివగౌడ్‌ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం భువనగిరి ఏరియా ఆస్పత్రి ఎదుట విద్యార్థి కుటుంబ సభ్యులు, స్నేహితులు ధర్నా చేపట్టారు. వాహనం మితిమీరిన వేగంతో వచ్చి ఢీకొట్టడంతో శివ అక్కడిక్కడే మృతి చెందాడని, న్యాయం జరిగే వరకు ఇక్కడినుంచి కదిలేదని స్పష్టం చేశారు. కారు యజమాని మృతుని కుటుం బానికి రూ. 2 లక్షల నష్టపరిహారం ఇస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy