స్కూలుకెళ్లనున్న యువరాజు

35452బ్రిటీష్ రాజకుటుంబానికి చెందిన బుల్లి యువరాజు చదువుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్టన్ ల తొలి సంతానమైన ప్రిన్స్ జార్జ్…. ప్రస్తుతం జార్జ్ వయసు దాదాపుగా రెండున్నర సంవత్సరాలు. అయితే తమ కుమారున్ని స్కూలుకు పంపించాలని  ఆ రాజదంపతులు నిర్ణయించుకున్నారు. జార్జ్ నర్సరీ విద్యను మొదలెట్టనున్నట్లు కెన్సింగ్ టన్ చెందిన ఒకరు ఈ విషయాన్ని తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో యువరాజు చదువు ప్రారంభం అవుతుందని చెప్పారు. లండన్ ఈస్ట్ గా 110 మైళ్ల దూరంలో ఉన్న నార్ ఫోల్క్ లోని వెస్టాక్రె మాంటెస్సోరి స్కూళ్లో యువరాజుని చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఆ పాఠశాల కూడా బుల్లి యువరాజుకు స్వాగతం పలుకుతోంది

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy