స్కూల్ పిల్లలకూ ఆధార్

Aadhar-camps-1అన్నింటికి ఆధార్ కంపల్సరీ అయింది. సర్కార్ పని ఏదైనా..ఆధార్ ఉండాల్సిందేనంటున్నారు. సుప్రీం కోర్టు..అవసరం లేదని చెప్పినా.. ప్రభుత్వ పథకాల్లో అవినీతికి చెక్ పెట్టేందుకు.. ఆధార్ ఐడెంటిటిని యూజ్  చేసుకుంటోంది కేంద్రం. అందుకే.. పెద్దోళ్లకే కాదు.. స్కూల్ పిల్లలకు ఆధార్ ఉంటే బెటర్ అనే ఫీలింగ్ కు వచ్చింది. ఆధార్ తో విద్యార్థుల కోసం  అందిస్తున్న..స్కీంలలో..అక్రమాలు జరగకుండా..చూడొచ్చనే ఆలోచనలో ఉంది.  దీంతో స్కూళ్లో చదివే.. 6 నుంచి 18 ఏళ్ల వయసున్న స్టూడెంట్స్ అందరూ..ఆధార్ తీసుకునేలా..చర్యలు తీసుకోవాలని స్టేట్ గవర్నమెంట్స్ కు ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేసింది కేంద్రం.

కేంద్రం ఆదేశాలతో.. రాష్ట్రంలో విద్యార్థులందరికి ఆధార్ కార్డులు ఇప్పించే చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం. ఇప్పటికే ఇంటర్, డిగ్రీ స్టూడెంట్స్ కు..ఆధార్ కార్డులున్నందున్న.. కేవలం పదోతరగతి లోపు విద్యార్థులపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులతో పాటు ప్రైవేట్ స్టూడెంట్స్..కు కార్డులందించే ఏర్పాట్లు చేస్తోంది విద్యాశాఖ. స్టేట్ లో..ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్తుల సంఖ్య 59 లక్షలు. వీరిలో …18 లక్షల మంది విద్యార్థులకు.. ఇప్పటికే ఆధార్ ఉన్నట్లు గుర్తించింది. మిగిలిన వారికి ఆధార్ ఇప్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం.స్పెషల్ గా స్కూల్స్ లోనే.. క్యాంపులను ఏర్పాటు చేసి…ఈ ఆపరేషన్ ను కంప్లీట్ చేయాలని భావిస్తోంది. ఆధార్ నిబంధనల ప్రకారమే స్టూడెంట్స్  నమోదు ప్రక్రియ జరగాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది కేంద్రం. అయితే  6 ఏళ్లలోపు ఉన్న చిన్నారులకు ఆధార్ ను అందించే బాధ్యత మహిళా, శిశు సంక్షేమ శాఖకు అప్పగించింది కేంద్ర మానవవనరుల శాఖ. తల్లిదండ్రులతో కలిసి ఆధార్ ఫోటో ఉండేలా..నిబంధనలను సడలించింది. డిసెంబర్ లోగా.. ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి.. కేంద్రానికి వివరాలందించాలని చూస్తోంది స్టేట్ గవర్నమెంట్.

విద్యార్థుల కోసం.. ఎన్నో రకాల స్కీంలను అందిస్తోంది కేంద్రం. అయితే.. రాష్ట్ర ప్రభుత్వాలు పంపే డైస్ డాటా ఆధారంగానే ఈ పథకాలకు నిథుల కేటాయింపు జరుగుతోంది. దీంతో.. కొన్ని రాష్ట్రాలు..విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపుతున్నాయన్న కంప్లైంట్స్ రావడంతో.. ఆధార్ లింక్ ప్రాసెస్ ను స్టార్ట్ చేసింది కేంద్రం. ప్రజెంట్ …రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆధార్ వివరాల ఆధారంగానే.. వచ్చే అకాడమిక్ ఇయర్లో.. నిధుల విడుదల చేసేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా.. విద్యార్థుల సంఖ్యను కచ్చితంగా తెలుసుకోవడంతో పాటు.. వారికిచ్చే నిధుల ప్రయోజనాలు సక్రమంగా అందే వీలుంటుందన్నది కేంద్రం ఆలోచన.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy