స్కూళ్లలో అధిక ఫీజులా.. ఈ నంబర్ కు కాల్ చేయండి

school-busఏటికేడు పెరుగుతున్న స్కూల్ ఫీజులతో.. విద్యార్థుల తల్లిదండ్రుల పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. నర్సరీ పిల్లలకే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి కొన్ని స్కూల్స్. ఈ ఫీజుల భారంతో జేబులు గుల్లవుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్‌లోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మొత్తం 4వేల 500 వరకు ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 14 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. సగానికి పైగా స్కూళ్ల యాజమాన్యాలు ఏటా ఫీజులు ముందస్తుగానే వసూలు చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాల్ని స్కూళ్లలోనే అమ్ముతున్నాయి యాజమాన్యాలు. రూల్స్ ప్రకారం.. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే అమ్మాలి. స్కూళ్లో అమ్మే పుస్తకాలు, డ్రెస్సులు మార్కెట్ లో మరో మూడు చోట్ల కచ్చితంగా దొరకాలి. ఒక్కో విద్యార్థి నుంచి ఏటా అదనంగా రూ.1,000-1,500 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పుస్తకాల్ని, దుస్తుల్ని పాఠశాలలోనే కొనాలని బలవంత పెడితే.. తమకు తెలపాలంటున్నారు హైదరాబాద్ విద్యాశాఖ అధికారులు. ఫిర్యాదులకు 040-23237350 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. deo_hydbad@yahoo.co.in మెయిల్ చేయొచ్చు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy