స్కెచ్ వేసి మరీ : సింగర్, డాన్సర్ హర్షిత హత్య

harshitha-dahiyaహర్యానాలో సంచలనం. ప్రముఖ సింగర్, డాన్సర్ అయిన హర్షిత దహియాను అతి కిరాతకంగా చంపారు దుండగులు. అక్టోబర్ 17వ తేదీ మంగళవారం సాయంత్రం పానిపట్టు జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. 22 ఏళ్ల హర్షిత సింగర్ కమ్ డాన్సర్ గా ఎదుగుతోంది. అందంతోపాటు యాక్టింగ్, డాన్సింగ్ లో యువత మనసు దోచుకుంది. ప్రముఖుల ఫంక్షన్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్ ఉండాలంటే హర్షిత డాన్స్ షోలు ఏర్పాటు చేస్తుంటారు. ఇలా ఎదుగుతున్న క్రమంలోనే.. మంగళవారం హత్యకు గురవ్వటం సంచలనం అయ్యింది.

పానిపట్టు జిల్లా చాంరార గ్రామంలో మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నది హర్షిత. తనతోపాటు ఉన్న మరో ముగ్గురితో కలిసి పానిపట్టు జిల్లా కేంద్రానికి కారులో బయలుదేరింది. గ్రామ శివార్లు దాటిన తర్వాత నల్లకారులో వచ్చిన ఇద్దరు ఆగంతకులు వీరి కారును అడ్డగించారు. హర్షిత దహియాపై అతి సమీపం నుంచి ఏడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆరు బుల్లెట్లు తల, మెడ భాగం నుంచి దూసుకెళ్లాయి. కారులో చనిపోయింది హర్షిత. కారులోని డ్రైవర్, మిగతా ముగ్గురిని దుండుగులు ఏమీ అనలేదు. వాళ్లపై కాల్పులు కూడా జరపలేదు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ అధికారులు.. హర్షితను మాత్రమే చంపటానికి వచ్చారని.. దీని వెనక బలమైన కారణాలు ఉండి ఉంటాయని తెలిపారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న హర్షిత దహియా.. నేను బెదిరింపులకు భయపడను అని.. చావు అంటే భయం లేదని వ్యాఖ్యలు చేశారు. అలా అన్న కొన్ని రోజులకే హత్యకు గురవ్వటం చూస్తుంటే.. కొన్నాళ్లు బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. ఈ హత్య చేసినోళ్లను, చేయించినవారిని ఎవరికీ వదిలేది లేదని ప్రకటించారు పోలీసులు

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy