స్కేటింగ్: రికార్డ్ బ్రేక్ చేసిన చిన్నారి

scatingస్కేటింగ్ లో తన రికార్డును తానే బ్రేక్ చేశాడు ఓ ఎనిమిదేళ్ల చిన్నోడు. మణిపూర్‌కి చెందిన టిలుక్‌ కైసమ్‌ లింబో స్కేటింగ్‌లో అదరగొట్టాడు. 8ఏళ్ల వయసులో కొత్త గిన్నిస్‌ రికార్డును సృష్టించి అదరహో అనిపించాడు. 475 అడుగుల దూరాన్ని కేవలం 30సెంటీమీటర్ల ఎత్తుగల హర్డిల్స్‌ కింది నుంచి స్కేటింగ్‌ చేస్తూ వెళ్లడం ద్వారా ఈ రికార్డు సృష్టించాడు. దీంతో 2015లో తన పేరిట ఉన్న 116 మీటర్ల గిన్నిస్‌ రికార్డును తనే బ్రేక్ చేశాడు. ఈ రికార్డుకి సంబంధించిన వీడియోను గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ విడుదల చేసింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy